న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ మరో రెండు మాడళ్ల ధరలను పెంచింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్, డిజైర్ సెడాన్ ధరలను రూ.10 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇటీవ మార్కెట్లోకి విడుదల చేసిన నాలుగో జనరేషన్ డిజైర్‌ను కూడా పెంచేసింది.
సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో స్విఫ్ట్ రూ.5 వేల వరకు అధికంకానుండ గా, డిజైర్ రూ.10 వేల వరకు ప్రియంకానున్న ది. ఉత్పత్తి వ్యయం అధికం కావడం వల్లనే ధరలను పెంచాల్సి వచ్చిందని సంస్థ పేర్కొంది. దీంతో డిజైర్ రూ.6.84 లక్షల నుంచి రూ.9.99 లక్షల లోపు, స్విఫ్ట్ రూ.6.49 లక్షల నుంచి రూ.9.5 లక్షల లోపు లభించనున్నది.