రికార్డు స్థాయిలో మారుతి కార్ల ఉత్పత్తి
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ మరో రికార్డును సృష్టించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ 23.4 లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. ఒకే ఏడాది ఇంతటి స్థాయిలో వాహనాలను ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారని కంపెనీ పేర్కొంది. కేవలం ప్యాసింజర్ వాహనాలను భారత్‌కు తయారు చేసి ఈ రికార్డు నెలకొల్పినట్టు దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) తాజాగా వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ మరో రికార్డును సృష్టించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ 23.4 లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. ఒకే ఏడాది ఇంతటి స్థాయిలో వాహనాలను ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారని కంపెనీ పేర్కొంది. కేవలం ప్యాసింజర్ వాహనాలను భారత్‌కు తయారు చేసి ఈ రికార్డు నెలకొల్పినట్టు దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) తాజాగా వెల్లడించింది.
ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో హిసాచి తకేచి మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కార్లను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఒకే దేశంలో ఒకే ఏడాది ఇంతటి స్థాయిలో ఉత్పత్తి జరుపడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. జీఎస్టీ 2.0ని ప్రకటించడంతోపాటు మార్కెట్లు మరింత బలోపేతం కావడం, చిన్న స్థాయి కార్లకు పెరుగుతున్న డిమాండ్‌తో కార్ల అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఏటా ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షలకు పెంచుకునేయోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు. గతేడాది డిజైర్, ఫ్రాంక్స్, స్విఫ్ట్, ఎర్టిగా, బాలెనో మాడళ్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి. ప్రస్తుతం సంస్థకు దేశవ్యాప్తంగా నాలుగు ఉత్పత్తి కేంద్రాలు ఉండగా, ఐదో ప్లాంట్ త్వరలో అందుబాటులోకి రాబోతున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

