పెద్దపల్లి : పాత కక్షలతో ఓ వ్యక్తి దాడి(attack)కి పాల్పడటంతో పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి (Peddapalli) మండలం రాగినేడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన కార్తీక్ వెంకటేష్ కొడుకు గత సంవత్సరం చనిపోయాడు. తన కుమారుడి మృతికి అదే గ్రామానికి చెందిన పరుశరాములు కుటుంబ సభ్యులే కారణమని భావించిన వెంకటేష్ పరశురాములు కుటుంబంపై ద్వేషం పెంచుకున్నాడు. మంగళవారం అయ్యప్ప పూజలో పాల్గొన్న ఇల్లందుల వీరయ్య, ఇల్లందుల పరశరాములుపై వెంకటేష్ తన అనుచరులతో కలిసి కర్రలతో దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. వీరయ్యకు తీవ్ర గాయాలవడంతో దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.