నడక, యోగా.. ఈ రెండు అలవాట్లు ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. యోగాతో కలిపి కూడా నడకను కొనసాగించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ ‘తాడాసన వాకింగ్’తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.
తాడాసన వాకింగ్ అంటే.. యోగాలోని తాడాసనం వేస్తూ నడవడమే! ముందుగా నిటారుగా నిలబడి, పాదాలను ఒకదానితో ఒకటి కలిపి ఉంచాలి. చేతులను శరీరానికి అతికినట్టుగా ఉంచాలి. తల, వెన్నెముకను నిటారుగా ఉంచి.. నడక సాగించాలి. నడిచేటప్పుడు కాళ్లను క్రమంగా ముందుకు, వెనుకకు కదిలిస్తూ నడవాలి. నడిచేటప్పుడు శ్వాస పీల్చుకుంటూ ఒక అడుగు ముందుకు వేసి.. శ్వాస వదులుతూ మరొక అడుగు వేయాలి.