Manoj Tiwary : పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ(Manoj Tiwary) ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో బిహార్‌తో మ్యాచ్ తనకు చివరిదని తేల్చి చెప్పాడు. శనివారం మనోజ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అందులో తన రంజీ కెరీర్.. ఈడెన్ గార్డెన్స్‌తో తనకున్న అనుబంధాన్ని చెప్పాడు. నిరుడు వీడ్కోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న మనోజ్ తివారీ ఈసారి నో యూటర్న్ అంటున్నాడు.
2006లో రంజీల్లో అరంగేట్రం చేసిన తివారీ 2008లో టీమిండియా జెర్సీవేసుకున్నాడు. అయితే.. అతడికి కేవలం 12 వన్డేలు, 3 టీ20లు ఆడే అవకాశం వచ్చింది. భారత జట్టు తరఫున 2015లో జింబాబ్వేపై చివరి మ్యాచ్ ఆడేసిన తివారీ రంజీలపై దృష్టి పెట్టాడు.
Hi all,
So… It’s time for the one last dance! Possibly one last time for a long walk towards my beloved 22 yards. I will miss every bit of it! 🏏
Thanks for cheering and loving me all these years. Would be loving it if you all come down to my favourite #EdenGardens today and… pic.twitter.com/uRsVS1Zsnp
— MANOJ TIWARY (@tiwarymanoj) February 17, 2024
ఈ సీజన్లో అతడు పది వేల పరుగుల మైలురాయికి చేరుకున్నాడు. ఈ కుడి చేతివాటం బ్యాటర్ 141 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 30 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు బాదాడు. టీమిండియాలో చోటు కోల్పోయిన తివారీ ఐపీఎల్లో మెరిశాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్(Delhi Daredevils), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), కింగ్స్ ఎలెవన్ పంజాబ్(Kings XI Punjab), రైసింగ్ పూణే సూపర్ జెయింట్స్(Rising Pune Supergiants) ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.