IND vs ENG 3rd Test : రాజ్‌కోట్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్(68) హాఫ్ సెంచరీ బాదాడు. హర్ట్లే బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అప్పటివరకూ నిదానంగా ఆడిన యశస్వీ ఒక్కసారిగా వేగం పెంచాడు.
అంతకుముందు అండర్సన్ బౌలింగ్‌లో వరుసగా 6,4,4 బాదిన యశస్వీ.. ఆతర్వాత హర్ట్లేను ఉతికారేశాడు. దాంతో, ఆ రెండు ఓవర్లలోనే భారత్ 32 పరుగులు సాధించింది. యశస్వీ దూకుడుతో టీమిండియా ఆధిక్యం 237 పరుగులకు చేరింది. మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్(26) పరుగులతో ఆడుతున్నాడు.
6⃣ x 2 🔥
Yashasvi Jaiswal is dealing in maximums at the moment in Rajkot 🙌#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/JtEbJETcAz
— BCCI (@BCCI) February 17, 2024
మూడో రోజు ఇంగ్లండ్‌ను 319 పరుగులకే కట్టడి చేసిన భారత్.. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. అయితే.. ఓపెనర్ రోహిత్ శర్మ(30) దూకుడుగా ఆడబోయి రూట్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శుభ్‌మన్ గిల్()తో కలిసి యశస్వీ జైస్వాల్() జాగ్రత్తగా ఆడాడు. దాంతో, టీ బ్రేక్ సమయానికి భారత్ వికెట్ 44 నష్టానికి రన్స్ కొట్టింది.