Fire Accident | ప్రకాశం జిల్లా చీరాలలో అగ్ని ప్రమాదం జరిగింది. విజయనగర్ కాలనీ వద్ద వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో ఉపయోగిస్తున్న భారీ క్రేన్ అగ్నికి ఆహుతైంది. సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోమవారం ఉదయం క్రేన్ ఇంజిన్‌లో అకస్మా్త్తుగా మంటలు చెలరేగాయి. ఇంజిన్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ క్రేన్‌లో మంటలు వచ్చాయి. ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో కాలనీవాసులు భయబ్రాంతులకు గురయ్యారు. ఘటనా సమయంలో క్రేన్‌లో, సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
చీరాలలో అగ్ని ప్రమాదం
విజయనగర్ కాలనీ వద్ద వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రహదారి పనులకు ఉపయోగిస్తున్న ఓ భారీ మొబైల్ క్రెన్ ఇంజన్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
మంటల్లో పూర్తిగా దగ్ధమైన క్రెన్ ఇంజన్ భాగం
ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చిన ఫైర్ సిబ్బంది… pic.twitter.com/SF48WK7xKC
— Telugu Scribe (@TeluguScribe) December 22, 2025