ముంబై : టీ20 వరల్డ్కప్(T20 World Cup 2026)తో పాటు న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్కు ఇవాళ బీసీసీఐ భారత జట్టును ప్రకటించనున్నది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సమావేశం అయ్యారు. భారత కెప్టెన్ సూర్యకుమార్తో పాటు సెలెక్టర్ అగార్కర్.. జట్టును ప్రకటించనున్నారు. వరల్డ్ కప్ కోసం గ్రూప్ ఏ లో ఇండియా ఉన్నది. ఆ గ్రూపులో నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్ ఉన్నాయి. టీ20 వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ ఫామ్ గురించి సెలెక్టర్లు ఆందోళన చెందుతున్నారు. షార్టెస్ట్ ఫార్మాట్లో పరుగులు రాబట్టడంలో గిల్ ఇబ్బందిపడుతున్నారు. డిప్యూటీ కెప్టెన్సీ పదవిని అతను కోల్పోయే అవకాశం ఉన్నది. ఆల్రౌండర్ జాబితాలో వాషింగ్టన్ సుందర్, బ్యాటర్ రింకూ సింగ్ పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రాణించలేదు. దీంతో అతనికి కూడా కెప్టెన్గా చివరి ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.