Kesineni Nani | చంద్రబాబును సీటు అడిగితే 200 కోట్లు కావాలంటాడు.. కేశినేని నాని ఫైర్
Kesineni Nani | అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ఏపీలో రాజకీయాలు వేడేక్కుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత కాక పుట్టిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కో సీటు కోసం రూ.200 కోట్లు అడుగుతారని సంచలన ఆరోపణలు చేయగా.. వాటికి కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తానని చెప్పి కేశినేని నాని డబ్బులు వసూలు చేశాడని విమర్శించారు.
Kesineni Nani | అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ఏపీలో రాజకీయాలు వేడేక్కుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత కాక పుట్టిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కో సీటు కోసం రూ.200 కోట్లు అడుగుతారని సంచలన ఆరోపణలు చేయగా.. వాటికి కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తానని చెప్పి కేశినేని నాని డబ్బులు వసూలు చేశాడని విమర్శించారు.
చంద్రబాబును సీటు అడిగితే రూ.200 కోట్లు అడుగుతారని విజయవాడ ఎంపీ కేశినేని సంచలన ఆరోపణలు చేశారు. డబ్బులు అడుతారనడానికి తానే సాక్ష్యమని కూడా చెప్పారు. బాబు గ్యారంటీ ఆయనకు, ఆయన కుమారుడికి మాత్రమే ఉంటాయని ఆరోపించారు. పేదవాడికి అవకాశమిచ్చిన పేదల పక్షపాతి జగన్ అని కొనియాడారు. జగన్ మళ్లీ సీఎం అయితే సంక్షేమం రెట్టింపు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేశ్ కుర్చీలు మడతబెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఎద్దేవా చేశారు. తండ్రీకొడుకులు కలిసి కుర్చీ మడతపెట్టడం కాదు.. ఏకంగా టీడీపీనే మడత పెట్టేశారంటూ వ్యాఖ్యానించారు.
కాగా, చంద్రబాబు కోసం పూజలు చేసిన కేశినేని నాని.. ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నాడని కేశినేని చిన్ని విమర్శించారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి ఇద్దరి దగ్గర నుంచి కేశినేని నాని కోట్లాది రూపాయలు వసూలు చేశాడని ఆరోపించారు. తామిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని నానిపై వాళ్లు ఒత్తిడి తెస్తున్నారని కూడా తెలిపారు. కేశినేని నాని కాల్ రికార్డ్స్ తన దగ్గర ఉన్నాయని అన్నారు. నాని ఒక వసూలు రాజా అని సెటైర్లు వేశారు. జగన్ దగ్గర, వైసీపీ ఇన్‌ఛార్జిల దగ్గర కేశినేని నాని పాలేరు పనిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
తాను వచ్చానని స్పష్టం చేశారు. దీనిపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

