జైనూర్ : మాంగ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు గైక్వాడ్ తులసీదాస్( Gakiwad Tulasidas)ను జైనూర్‌లో ఘనంగా సన్మానించారు. జైనూర్‌కు వచ్చిన ఆయనకు మాంగ్ సమాజ్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు, దళిత రత్న అవార్డు గ్రహీత మావాలే దత్తమాంగ్ ఆధ్వర్యంలో నాయకులు సన్మానం చేశారు.
మాంగ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు గైక్వాడ్ తులసీదాస్‌కు సన్మానం అనంతరం ఆ ప్రాంతంలోని ఎస్సీల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్సీల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని, అధికారుల ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర అధ్యక్షులు తులసీదాస్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మాంగ్ సమాజ్ నాయకులు పుల్లారే మారుతి, శివాజీ దుబాయ్ తిరుపతి నివర్తి, ఇతర సంఘాల నాయకులు సిందే గోవింద్, ప్రకాష్ గిత్త యుద్ధం హనుమంతు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.