GT vs SRH | రాణించిన సుదర్శన్, సుందర్.. సన్‌రైజర్స్ ముందు మోస్తరు లక్ష్యం..!
GT vs SRH : అహ్మదాబాద్‌లో సన్‌రైజర్స్ బౌలర్లు సత్తా చాటారు. సొంతగడ్డపై దంచేయాలనుకున్న గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లకు కళ్లెం వేశారు.
GT vs SRH : అహ్మదాబాద్‌లో సన్‌రైజర్స్ బౌలర్లు సత్తా చాటారు. సొంతగడ్డపై దంచేయాలనుకున్న గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లకు కళ్లెం వేశారు. పవర్ ప్లేలోనే గుజరాత్ ప్రఫుల్ హింగే(2-17) బ్రేకులు వేయగా.. మిడిల్ ఓవర్లలో కమిన్స్(1-20), షకీబ్ హుస్సేన్(౦1-31)లు కట్టడి చేశారు. స్లో వికెట్ మీద సాయి సుదర్శన్(61), సుందర్(50)లు అర్ధ శతకంతో పోరాడగా గుజరాత్ గట్టెక్కింది. డెత్ ఓవర్లలో సుందర్ దూకుడుతో నిర్ణీత ఓవర్లలో గుజరాత్ 168 పరుగులకే పరిమితమైంది.
టాస్ ఓడిన గుజరాత్ టైటాన్స్‌ను పవర్ ప్లేలో సన్‌రైజర్స్ పేసర్లు వణికించారు. ఉప్పల్ హీరో ప్రఫుల్ హింగే(2-17) రెండు వికెట్లతో బ్రేకివ్వగా గుజర్తా ఇన్నింగ్స్ నత్తనడకను తలపించింది. తొలుత హింగో ఓవర్లో శుభ్‌మన్ గిల్(5) మిడ్ వికెట్లో ఆడిన బంతిని క్లాసెన్ డైవింగ్ క్యాచ్ పట్టాడు. ఆపై స్పూప్ షాట్ ఆడాలనుకున్న బట్లర్(7) వికెట్ కీపర్ ఇషాన్ చేతికి చిక్కాడు. అనంతరం.. నిశాంత్ సింధు(22), ఓపెనర్ సాయి సుదర్శన్(61) కీలక భాగస్వామ్యంతో ఆదుకునే ప్రయత్నం చేశారు.
Smooth 𝙎𝙖𝙞-𝙡𝙞𝙣𝙜 through the storm ⛵️
The #GT opener yet again looking in good touch 👌
Updates ▶️ https://t.co/o2tKKCeEaH#TATAIPL | #KhelBindaas | #GTvSRH | @gujarat_titans | @sais_1509 pic.twitter.com/PCWm9lBnWp
— IndianPremierLeague (@IPL) May 12, 2026
కానీ, ఈసారి కమిన్స్, క్లాసెన్ జోడీ సింధును వెనక్కి పంపింది. అంతే.. 64కే మూడు కీలక వికెట్లు పడ్డాయి. ఆ దశలో సుందర్(50) జతగా సుదర్శన్ జట్టును గట్టెక్కించే ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధ శతకంతో గుజరాత్‌కు మంచి స్కోరందించాలనుకున్న సుదర్శన్‌ను షకీబ్ వెనక్కి పంపాడు. డెత్ ఓవర్లలో ధాటిగా ఆడిన సుందర్ మలింగ బౌలింగ్‌లో ఫైన్ లెగ్‌లో 4, 6 బాదాడు. చివరి ఓవర్లో షకీబ్ 10 రన్సే ఇవ్వడంతో హైదరాబాద్‌కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

