Maharashtra | మహారాష్ట్రలో ఘోరం.. గుడి గోడ కూలి ఆరుగురు మృతి.. 14 మందికి గాయాలు
Maharashtra : మహారాష్ట్రలో ఒక దేవాలయం గోడ కూలి ఆరుగురు మరణించగా, 14 మంది గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా, జాట్ తాలూకా, మోతేవాడి గ్రామంలో మంగళవారం జరిగింది.
Maharashtra : మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఒక దేవాలయం గోడ కూలి ఆరుగురు మరణించగా, 14 మంది గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా, జాట్ తాలూకా, మోతేవాడి గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా మర్గుబాయ్ దేవి యాత్ర సందర్భంగా వేడుకలు నిర్వహించేందుకు భక్తులు గుడి ప్రాంగణంలో గుమిగూడారు.
ఈ సమయంలో భారీ వర్షం, వేగంగా వీచిన ఈదురుగాలుల కారణంగా అక్కడి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో చాలా మంది భక్తులు గోడ శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. గోడ కూలడంతో గాయాలపాలై ఆరుగురు మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
మృతుల్లో ముగ్గురు స్థానిక గ్రామస్తులు కాగా, మిగతా ముగ్గురు బీజాపూర్ తాలూకాకు చెందిన వారు. మంగళవారం ఈ దేవాలయానికి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారని, ఘటన జరిగిన సమయంలో 350 మందికిపైగా భక్తులు ఉన్నారని పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు సాంగ్లి ఎస్పీ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

