చిరంజీవి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక వెంకటేశ్ అయితే.. నవ్వించడంలో మాస్టర్ డిగ్రీనే తీసేసుకున్నారు. వీరిద్దరూ విడివిడిగా తెరపై కనిపిస్తేనే థియేటర్లలో నవ్వుల జల్లు కురుస్తూవుంటుంది. అలాంటిది ఇద్దరూ కలిసి ఓకే సినిమాలో నటిస్తే?!.. ఇక నవ్వుల సునామీనే. వచ్చే సంక్రాంతికి థియేటర్లన్నింటిలో ‘మన శంకరప్రసాద్గారు’ రూపంలో నవ్వుల సునామీ రానున్నది. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్ ఓ కామియో రోల్ చేస్తున్నారు.
నేటి నుంచి వీరిద్దరి ఎపిసోడ్‌కి సంబంధించిన షూట్ మొదలుకానున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్లో కామెడీకి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వంలో చిరంజీవి, వెంకటేశ్ కలిసి నటించనున్న ఈ ఎపిసోడ్, ప్రేక్షకులకు గొప్ప కామెడీ ట్రీట్‌ని ఇవ్వడం ఖాయం. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, నిర్మాణం: షైన్ స్క్రిన్స్, గోల్డ్ బాక్స్ ఎంటైర్టెన్మెంట్స్.