Divvela Madhuri | తెలుగు ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ 9వ సీజన్ కొనసాగుతున్నది. విజయవంతంగా ఐదువారాలను పూర్తి చేసుకుంది. ఇక ఆరోవారంలోకి అడుగుపెడుతున్న సమయంలో బీబీ హౌస్‌లో ఉన్న ఇద్దరిని డబుల్ ఎలిమినేషన్‌తో ఇంటికి పంపారు. ఎలిమినేషన్ అయిన వారి స్థానంలో పలువురిని వైల్డ్‌కార్డ్స్‌గా హౌస్‌లోకి పంపనున్నారు. ఈ రియాలిటీ షోలోకి దివ్వెల మాధురి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. డబుల్ ఎలిమినేషన్ నేపథ్యంలో హౌస్‌లో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడంతో పాటు ఆటలో మరింత వేడి పెంచేందుకు నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మాధురితో పాటు మరో ఐదుగురు కంటెస్టెంట్స్ సైతం హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు.
ఉత్తరాంధ్రకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్‌తో ఉన్న సంబంధం కారణంగా దివ్వెల మాధురి పేరు ఏపీ, తెలంగాణలో రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారుమోగింది. శ్రీనివాస్‌తో ఆమెకు ఉన్న రిలేషన్‌షిప్‌తో పెద్ద వివాదం కొనసాగింది. ఈ విషయం మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. మాధురికి అనూహ్యమైన పాపులారిటీని తెచ్చిపెట్టింది. మాధురి, సోషల్ మీడియాలో రీల్స్, డ్యాన్స్ వీడియోలతో చురుగ్గా ఉండి, చీరల బిజెనెస్‌లో కూడా రాణిస్తున్నారు. గతంలో బిగ్‌బాస్ ఆఫర్లు వచ్చినా.. కుటుంబానికి దూరంగా ఉండలేక తిరస్కరించిన ఆమె, ఈసారి వైల్డ్ కార్డ్ ద్వారా షోలో పాల్గొనడానికి అంగీకరించినట్లు సమాచారం.
బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టేముందు, ఆమె ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ‘బిగ్‌బాస్ అనేది మనల్ని మనం నిరూపించుకోవడానికి గొప్ప వేదిక. నాకున్న పాపులారిటీని మరింత పెంచుకోవడం, ఎక్కువ మందికి చేరువ కావడమే నా లక్ష్యం. 80 ఏళ్లు దాటిన మహిళలు కూడా నాకు మద్దతుగా నిలుస్తున్నారు. నాకోసం పూజలు చేస్తున్నారని చెబుతున్నారు. ఒకవేళ టైటిల్ గెలిస్తే, ప్రైజ్ మనీని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తా’ అని చెప్పారు. అయితే, ఆమె కుటుంబ సభ్యులను, ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్‌ను, పిల్లలను మిస్ అవుతానని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
ఇదిలా ఉండగా మాధురి ఎంట్రీ బీబీ ఎంట్రీ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ సైతం వీడియో విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఇప్పటివరకు బిగ్‌బాస్ ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అంటూ మాస్ డైలాగ్ చెప్పారు. ఆమెకు ఎవరు ఎదురొచ్చినా.. ఆమె ఎవరికి ఎదురెళ్లినా వారికే ప్రమాదమని.. ఆయన వ్యాఖ్యానించారు. ఇది హౌస్‌లోని కంటెస్టెంట్లకు పరోక్షంగా హెచ్చరిక ఇచ్చినట్లుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వివాదాస్పద నేపథ్యం, బలమైన మద్దతుతో బీబీ హౌస్‌లోకి దివ్వెల మాధురి బిగ్‌బాస్ ఎంట్రీ ఇవ్వనుండడంతో రాబోయే రోజుల్లో బిగ్‌బాస్ ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Grace with grit. Fire with flair. 💫#DuvvadaMadhuri walks into the Bigg Boss house to set Season 9 ablaze with her unstoppable energy! 🔥⚡#BiggBossFireStorm
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar pic.twitter.com/jo9bDhTYXG
— Starmaa (@StarMaa) October 12, 2025