Bigg Boss Telugu | బిగ్‌బాస్‌లోకి వైరల్ వయ్యారి..! వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన రమ్య..!
Bigg Boss Telugu | తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్ కొనసాగుతున్నది. షో ఆరోవారంలోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో షో నిర్వాహకులు కొత్తగా వైల్డ్‌కార్డ్స్ ఎంట్రీ ఇచ్చారు. కొద్దిరోజుల కింద సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన కంచర్ల రమ్య మోక్ష (అలేఖ్య చిట్టిపికిల్స్ ఫేమ్) తొలి వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా స్టేట్పైకి ఎంట్రీ ఇచ్చింది.
Bigg Boss Telugu | తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్ కొనసాగుతున్నది. షో ఆరోవారంలోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో షో నిర్వాహకులు కొత్తగా వైల్డ్‌కార్డ్స్ ఎంట్రీ ఇచ్చారు. కొద్దిరోజుల కింద సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన కంచర్ల రమ్య మోక్ష (అలేఖ్య చిట్టిపికిల్స్ ఫేమ్) తొలి వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా స్టేట్పైకి ఎంట్రీ ఇచ్చింది. పక్కా లోకల్ సాంగ్‌కి పెర్ఫామెన్స్‌తో అదిరిపోయేలా ఎంట్రీ ఇచ్చింది. హోస్ట్ నాగార్జున స్వాగతం పలికాడు. ఈ సందర్భంగా రమ్య మాట్లాడుతూ.. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తానో అని ఎంత వెయిట్ చేశానో అంటూ చెప్పగా.. ఇప్పుడు కలిసేశావ్ కదా అంటూ నాగార్జున సైతం నవ్వాడు. తనకు ఓ గోల్ ఉందని చెప్పగా.. ఊర కుక్కలకి తన సొంత డబ్బుతో ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నానని చెప్పింది. అది అమలతో ఓపెన్ చేయించాలనేది తన కలన అని చెప్పగా.. నాగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత రమ్య ఏవీ చూపించారు.
తన ఊరు, ఫ్యామిలీ, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం, పికిల్స్ వివాదం గురించి రమ్య చెప్పుకొచ్చింది. రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఎంత ఫేమస్సో.. తాను సైతం అంతే ఫేమస్ అని.. ఫ్యామిలీలో తాము ముగ్గురు అక్కాచెల్లెల్లం.. త్రీ రోజెస్లో తాను ఒక రోజ్ అని చెప్పింది. తన తండ్రి చనిపోవడం, ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆడియో మెస్సేజ్‌లు వైరల్ కావడం.. దాంతో ఎదురైన ఇబ్బందులు గురించి చెబుతూ భావోద్వేగానికి గురైంది. ఇక బీబీ హౌస్‌లోకి వెళ్లే ముందు హోస్ట్ నాగార్జున ఓ పవర్ ఇచ్చారు. లగ్జరీ ఫుడ్ పవర్‌గా చెబుతూ రమ్య చేతికి ఓ రెడ్ స్టోన్ ఇచ్చాడు. హౌస్‌లో ఎప్పుడు కావాలన్నా.. ఎవరి కోసమైనా వాడుకోవచ్చని నాగార్జున చెప్పారు. హౌస్‌లోకి వెళ్లేముందు ఆరు ట్యాగ్లు ఆరుగురు సభ్యులకి ఇవ్వాలని చెప్పగా.. ఓవర్ యాక్షన్ శ్రీజకి, సెల్ఫిష్ డీమాన్‌కి, మేనిపులేటర్ రాముకి బ్యాడ్జ్ ఇచ్చింది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఎవరూ తనకు నచ్చలేదని.. హౌస్‌లో ఎంటర్టైన్మెంట్ తక్కువైందని చెప్పింది. తాను ఎంటర్టైన్మెంట్ ఇస్తానని.. ఫిజికల్ టాస్క్‌లు ఆడుతానని చెప్పింది.
Bold. Blazing. Unbreakable.💥#RamyaMoksha enters the Bigg Boss house with fire in her heart and storm in her soul! 🌪️🔥#BiggBossFireStorm
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar pic.twitter.com/Q0vNd3czoB
— Starmaa (@StarMaa) October 12, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

