మరికల్ : మండల కేంద్రంలో వ్యక్తిపై శనివారం రాత్రి హత్యయత్నం ( Murder Attempt ) జరిగింది. ధన్వాడ ఎస్సై రాజశేఖర్, మరికల్ ఏఎస్సై ఎల్లయ్య కథనం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మరికల్ ( Marikal ) మండల కేంద్రానికి చెందిన లంబడి వెంకటేష్(45)ను అదే గ్రామానికి చెందిన బొండాల మల్లేష్ కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడు. లంబాడి వెంకటేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స కోసం మరికల్ ప్రైవేట్ ఆసుపత్రిలో అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
వివాహేతర సంబంధమే దాడికి దారితీసిందని పోలీసులు తెలిపారు. నిందితుడు మల్లేష్ పరారీలో ఉన్నాడని, లంబాడి వెంకటేష్ భార్య లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసును నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వారు వెల్లడించారు. లంబడి వెంకటేష్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినట్లు తెలిపారు.