Hyderabad | ఆర్వో ప్లాంట్ పేలిన ఘటనలో వ్యక్తి మృతి
నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో బుధవారం మధ్యాహ్నాం సంభవించిన భారీ పేలుళ్ల ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
బేగంపేట్ ఏప్రిల్ 9 : హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో బుధవారం మధ్యాహ్నాం సంభవించిన భారీ పేలుళ్ల ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. లేక్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జలవిహార్ ఆర్వో ప్లాంట్లో బుధవారం భారీ పేలుళ్లు జరిగిన విషయం పాఠకులకు విదితమే. అయితే ఈ ఘటనలో ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మణ్(50) తీవ్ర గాయాలు అవ్వడంతో అతని పోలీసులు సోమాజిగూడలోని జాయ్ హాస్పిటల్కు తరలించారు.
అతను చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరిలో అంజి(25) ప్రాథమిక చికిత్స పొంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగా మరో వ్యక్తి అప్పలనాయడు(45) గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు లేక్ పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపారు. వీరు ముగ్గురు జలవిహార్లోని క్వార్టర్స్లో ఉంటూ అక్కడే కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారు. మృతి చెందిన లక్ష్మణ్ మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

