నీలగిరి, అక్టోబర్ 2: నల్లగొండ పట్టణంలో వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం రాత్రి చైతన్యపురి కాలనీలో జరిగింది. కుటుంబ తగాదాలతో ఉన్న వ్యక్తిని భార్య పథకం ప్రకారం ఇంటికి పిలిచి.. కుటుంబ సభ్యులతో కలిసి కంట్లో కారం చల్లి, కర్రలు, బీరు సీసాలు, సిమెంట్ ఇటుకలతో బాది దారుణంగా హత్య చేశారు.
స్థానికులు, పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన బంటు వెంకటేశ్వర్లు(32) డీఎంహెచ్‌వో కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మిర్యాలగూడ రోడ్డులో ఉండే ముస్లిం కమ్యూనిటీకి చెందిన రేష్మాతో పరిచయం ఏర్పడింది. అప్పటికే రేష్మాకు వివాహం కాగా పిల్లలు కూడా ఉన్నారు. వీరి పరిచయం వివాహేతర సంబంధంగా మారడంతో వివాహం చేసుకున్నారు.
మొదటి భర్తతో రేష్మా విడాకులు తీసుకొని, 13 ఏండ్లుగా వెంకటేశ్వర్లుతో జీవిస్తుంది. వీరికి ఒక బిడ్డ కూడా పుట్టాడు. ఈ సమయంలోనే డీఎంహెచ్‌వో కార్యాలయంలో వెంకటేశ్వర్లు అటెండర్ కొలువు కూడా పోయింది. కొన్ని రోజులుగా వీరి మధ్య కుటుంబ కలహాలు రావడంతో రేష్మా పుట్టింటిలో ఉంటుంది. భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని రేష్మా పథకం ప్రకారం గురువారం రాత్రి భర్తను ఇంటికి పిలిచింది.
భార్య రేష్మా ఆమె సోదరులు యూసుఫ్, సమీర్, అయూసుఫ్ కర్రతో అతడిపై దాడి చేయగా ఆ కర్ర విరిగిపోయింది. వారి నుంచి తప్పించుకొని గేటు దగ్గరకు చేరుకునే సమయానికి, సమీర్ ఒక బీర్ బాటిల్‌తో తలపై దాడి చేయడంతో తలకు గాయమైంది. వెంకటేశ్వర్లు ఇంటి నుంచి బయటకు వస్తుండగా అందరూ కలిసి అతడి టీ-షర్టును చింపి, రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ ఇటులతో దాడి చేశారు. అతడు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల జనం గుమిగూడారు. ఆ గుంపును చూసి, వారు ఇంటికి తాళం వేసి పారిపోయారు. అప్పటికే తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే చనిపోయాడు.
విషయం తెలియడంతో నల్ల గొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, సీఐ ఏమి రెడ్డి రాజశేకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి మేన మామ ధర్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు నిందితులు వెంకటేశ్వర్లు హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే తన సిబ్బంది సహకారంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా అందులో నలు గురు పోలీసులకు పట్టుబడినట్లు సమా చారం. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలు స్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివ రాలను పోలీసులు సేకరిస్తున్నారు.