మరికల్, జూన్ 15: ప్రమాదవాశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలోని పెద్ద చింతకుంట గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరికల్ ఎస్ఐ రాము కథనం మేరకు ఇలా ఉన్నాయి. బీరప్ప, ఎల్లమ్మల కుమారుడు శివుని పూజకై తామర పూలకు చెరువుకు వెళ్లిన మల్లేష్(43) ప్రమాదవాశాత్తు చెరువులు పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
ప్రతి ఆదివారం శివుని పూజకై తామర పూలకు వెళ్లి తామర పూలు తీసుకొని శివ పూజ చేసేవాడని గ్రామస్తులు తెలిపినట్లు తెలిపారు. మల్లేష్ కు భార్య యాదమ్మతో పాటు ఇద్దరు కుమారులు కూతురు ఉన్నారు. ఇట్టి విషయమై భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాము తెలిపారు. మల్లేష్ మృతితో పెద్ద చింతకుంట గ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి. పూజకు పూలకై వెళ్లిన మల్లేష్ మృతి చెందడం బాధాకరంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.