Cybrer Crime : పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ (Bandi Bageerath) కేసు విచారణపై అసత్యాలు ప్రచారం చేసిన రాయసం దామోదర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భగీరథ్ కేసు విషయంపై హైకోర్టు జడ్జి పరువు, ప్రతిష్టకు భంగం వాటిల్లేలా అబద్దపు పోస్టులు పెట్టిన అతడిని నెల్లూరులో అదుపులోకి తీసుకన్నారు.
బండి భగీరథ్ కేసు విషయంలో హైకోర్టు జడ్డి భర్తకు ఛైర్మన్ పదవి ఇస్తారంటూ దామోదర్ సోషల్ మీఇయాలో పోస్ట్ పెట్టారు. దాంతో, అతడిపై హైకోర్టు రిజిస్ట్రార్ కేసు పెట్టారు. అసత్య పోస్టులు పెట్టిన దామోదర్‌పై సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు దామోదర్ కోసం వేట మొదలెట్టిన పోలీసులు సోమవారం అతడిని నెల్లూరులో అరెస్టు చేశారు.