CSK vs SRH | కమిన్స్ స్పీడ్‌కు తడబడిన చెన్నై.. సన్‌రైజర్స్ రెండు పాయింట్లు పట్టేస్తుందా..!
CSK vs SRH : చావోరేవో పోరులో చెన్నై సూపర్ కింగ్స్(CSK)ను సన్‌రైజర్స్ బౌలర్లు భారీ స్కోర్ కొట్టనివ్వలేదు. చెపాక్ స్టేడియంలో దంచేయాలనుకున్న సీఎస్కేను కమిన్స్(3-28) దెబ్బతీశాడు
CSK vs SRH : చావోరేవో పోరులో చెన్నై సూపర్ కింగ్స్(CSK)ను సన్‌రైజర్స్ బౌలర్లు భారీ స్కోర్ కొట్టనివ్వలేదు. చెపాక్ స్టేడియంలో దంచేయాలనుకున్న సీఎస్కేను కమిన్స్(3-28) దెబ్బతీశాడు. నిప్పులు చెరుగుతూ సీఎస్కే టాపార్డర్‌ను ప్యాటీ కూల్చగా.. మిడిలార్డర్‌ను షకీబ్ హుస్సేన్(2-34), ఇషాన్ ఇబ్బందిపెట్టాడు. మిడిల్ ఓవర్లలో డెవాల్డ్ బ్రెవిస్(44), కార్తిక్ శర్మ(32), దూబే(26)లు రాణించడంతో చెన్నై 180 పరుగులు చేసింది.
టాస్ ఓడిన సన్‌రైజర్స్‌కు కెప్టెన్ కమిన్స్(3-28) తొలి వికెట్ అందించాడు. ప్రఫుల్ హింగే ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో ప్రమాదకరంగా కనిపించిన సంజూ శాంసన్(27)ను వెనక్కి పంపాడు. సంజూ షాట్ ఆడాలనుకోగా బంతి బ్యాటును తాకుతూ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేతుల్లో పడింది. వస్తూనే ఉర్విల్ పటేల్(13) రెండు సిక్సర్లతో తన ఉద్దేశాన్ని చాటగా మూడు ఓవర్లకే స్కోర్ 40 దాటింది. కానీ, షకీబ్ హుస్సేన్(2-34) స్లో డెలివరీతో ఉర్విల్‌ను బౌల్డ్ చేసి చెన్నైకి షాకిచ్చాడు. ప్రస్తుతం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(15), కార్తిక్ శర్మ(32)లు ఇన్నింగ్స్ నిర్మించే పనిలో ఉన్నారు. పవర్ ప్లేలో చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది.
Shivam Dube 🤝 Dewald Brevis
🎥 The two set batters raising the run rate for #CSK 👊
Updates ▶️ https://t.co/4SxAzYKEvY#TATAIPL | #KhelBindaas | #CSKvSRH | @ChennaiIPL pic.twitter.com/19HgFC70tK
— IndianPremierLeague (@IPL) May 18, 2026
బ్రెవిస్ దూకుడు
పవర్ ప్లేలో రెండు వికెట్లు పడినా కుర్రాడు కార్తిక్.. గైక్వాడ్‌తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. కమిన్స్ ఓవర్లో చెన్నై సారథి వెనుదిరిగినా డెవాల్డ్ బ్రెవిస్(44), శివం దూబే(26)లు ధనాధన్ ఆడారు. వీరిద్దరి విధ్వంసంతో పరుగులు పెట్టిన చెన్నై స్కోర్ బోర్డుకు డెత్ ఓవర్లలో మలింగ, షకీబ్ బ్రేకులేశారు. వరసగా రెండో సిక్సర్ బాదాలనుకున్న బ్రెవిస్‌ను మలింగ, దూబేను షకీబ్ బౌల్డ్ చేశారు. చివరి ఓవర్లో ప్రశాంత్ వీర్() బౌండరీ రాబట్టగా 6 వికెట్ల నష్టానికి సీఎస్కే 181 పరుగులు చేయగలిగింది.
Timber 🎯
Not once, but twice! ✌️
Updates ▶️ https://t.co/4SxAzYKEvY#TATAIPL | #KhelBindaas | #CSKvSRH | @SunRisers pic.twitter.com/PTkv8Gnq3R
— IndianPremierLeague (@IPL) May 18, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- brevis
- CSK vs SRH
- Cummins
- ipl 2026
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

