టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మమత మేనల్లుడు
పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ స్థాయిని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అభిషేక్ బెనర్జీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా అతనికి పెద్ద బాధ్యత అప్పగించారు.

కోల్‌కతా : బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఇప్పుడు పార్టీపై దృష్టి పెట్టింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ స్థాయిని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అభిషేక్ బెనర్జీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా అతనికి పెద్ద బాధ్యత అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం మమతా అధ్యక్షతన టీఎంసీ వర్కింగ్ కమిటీ (కోర్ గ్రూప్) మొదటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో, మమతా బెనర్జీ తర్వాత తృణమూల్ పార్టీలో సెకండ్ కమాండర్‌గా అభిషేక్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పనున్నారు. డైమండ్ హార్బర్ ఎంపీగా ఉన్న అభిషేక్ బెనర్జీ.. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నియామకంతో యువ తృణమూల్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్నారు. కాగా, ఇదే సమావేశంలో ‘వన్ పర్సన్ వన్ పోస్ట్’ విధానానికి కూడా ఆమోదం లభించింది.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ ప్రధాన కార్యదర్శి పార్థా ఛటర్జీ మీడియాకు వెల్లడించారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నటి సయోని ఘోష్‌కు యూత్ ప్రెసిడెంట్ బాధ్యతను అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అసన్సోల్ నుంచి టీఎంసీ అభ్యర్థిగా నిలిచి బీజేపీకి చెందిన అగ్నిమిత్ర పాల్ చేతిలో ఓడిపోయింది. పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్‌ను నియమించగా, రాజ్యసభ సభ్యుడు డోలా సేన్‌కు తృణమూల్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు కునాల్ ఘోష్‌ను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మాజీ మంత్రి పూర్ణేండు బసును టీఎంసీ రైతు విభాగానికి అధ్యక్షునిగా చేశారు. సీపీఐ (ఎం) కు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు రితుబ్రతా బంధ్యోపాధ్యాయను రాష్ట్ర కార్మిక విభాగానికి అధ్యక్షుడిగా నియమించారు.
ఇవి కూడా చదవండి..
ఐరాస నివేదిక : అల్-ఖైదా అధినేత జవహరి బతికే ఉన్నాడు..
లినెథోల్మ్ ద్వీపం : సముద్ర మట్టం పెరగకుండా డెన్మార్క్ సృష్టి
ఔట్లుక్ నివేదిక : పర్యావరణ ప్రమాద జాబితాలో 43 నగరాలు మనవే..!
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
నెస్ట్-2021 దరఖాస్తు దాఖలు గడువు పొడగింపు
కరోనా ఎఫెక్ట్ : వైష్ణో దేవి యాత్రకు తగ్గిన భక్తులు
ప్రపంచ పర్యావరణ దినం: పీపీఈ కిట్ భూమిలో కరగడానికి 500 ఏండ్లు
చరిత్రలో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు
కరోనా టైం: సప్లిమెంట్స్ నకిలీలను ఇలా కనిపెట్టండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

