Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోగొట్టుకున్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసిన భవానిపూర్‌లో ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అగ్రనేత సువేందు అధికారి విజయం సాధించారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ, మొత్తం ఓట్లు, మెజారిటీ పరంగా చూస్తే భవానిపూర్‌లో మమత ఓటమి ఖాయం.
ఇక్కడ మమత దాదాపు 15 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలైనట్లు తెలుస్తోంది. పూర్తి ఫలితం ఇంకా వెలువడాల్సి ఉంది. మరోవైపు బెంగాల్లో పరాజయంపై మమత స్పందించారు. బీజేపీ 100కుపైగా సీట్లలో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. బెంగాల్లో పని చేసింది ఎన్నికల సంఘం కాదని, బీజేపీ సంఘం అని మమత విమర్శించారు. తమ పార్టీ మళ్లీ పుంజుకుని తిరిగొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 200 సీట్ల వరకు గెలుచుకుంది. మమతపై విజయం సాధిండచంపై సువేందు అధికారి స్పందించారు.
ఈ విజయం ఎంతో ప్రత్యేకమైందని, కీలకమైందని ఆయన వ్యాఖ్యానించారు. తనకు హిందువులు, సిక్కులు, బుద్ధిస్టులు, జైనులు అండగా నిలిచారని ఆయన అన్నారు. ఈ ఫలితాలతో బెంగాల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని 15 ఏళ్ల పాలనకు తెరపడింది. అన్ని సీట్లకు సంబంధించిన పూర్తి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.