Joginapally Santhosh Kumar : తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమిళ విట్ర కజగం(TVK) అధిపతి విజయ్ (Vijay)కు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ (Santhosh Kumar)హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తమిళనాట టీవీకే సాధించిన ఈ విజయం చారిత్రాత్మకమని, విజయ్ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఇది నిదర్శనమని సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగాగతంలో విజయ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఉత్సాహంగా పాల్గొన్న విషయాన్ని మాజీ ఎంపీ గుర్తుచేసుకున్నారు.
తొలి ఎన్నికల్లో జయభేరి మోగించిన టీవీకే అధినేత, జననాయగన్‌కు పర్యావరణ బాధ్యత, హరిత భవిష్యత్తు పట్ల ఉన్న నిబద్ధత స్ఫూర్తిదాయకమని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ప్రశంసించారు. విజయ్ నాయకత్వంలో తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి, శ్రేయస్సులో సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజా సేవలో, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విజయ్‌కి గొప్ప విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ వెల్లడించారు.
Heartfelt congratulations to @actorvijay garu on truly historic and resounding victory of @TVKVijayHQ in the Tamil Nadu elections. This remarkable mandate reflects the immense trust and belief that people have placed in your vision and leadership. Fondly recall your inspiring… pic.twitter.com/ETlcvHrCOQ
— Santosh Kumar J (@SantoshKumarBRS) May 4, 2026