The Red Bag | గెట్ రెడీ ఫర్ టీజర్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న‘ది రెడ్ బ్యాగ్’ టీం
The Red Bag | నలుగురు అమ్మాయిల లుక్స్‌తో రిలీజ్ చేసిన ‘ది రెడ్ బ్యాగ్’ (The Red Bag) పోస్టర్‌తో బ్యాగ్ చుట్టూ తిరిగే కథాంశంతో యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతుందంటూ హింట్ ఇచ్చారు మేకర్స్.
The Red Bag | విలన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు హర్యానా యాక్టర్ కబీర్ దుహన్ సింగ్. ఇప్పటిదాకా సిల్వర్ స్క్రీన్‌పై విలన్‌గా భయపెట్టిన కబీర్ దుహన్ సింగ్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’ (The Red Bag). ప్రసాద్ బెహరా మరో కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో రాధ్య, స్నేహా సింగ్, ఆకాంక్ష ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
మేకర్స్ ఇప్పటికే ఈ మూవీ ప్రీ లుక్‌ను విడుదల చేశారు. నలుగురు అమ్మాయిల లుక్స్‌తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌తో బ్యాగ్ చుట్టూ తిరిగే కథాంశంతో యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతుందంటూ హింట్ ఇచ్చారు మేకర్స్. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ చేసిన మరో పోస్టర్లో చేతినిండా రక్తం, ఆ బ్యాగును పట్టుకున్న తీరు, అక్కడే ఉన్న కత్తులు, తుపాకులు, రక్తపుమయంగా మారిన ఏరియా ఇలా ప్రతీ ఒక్కటి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
ఇటీవల సినిమాలో వచ్చే కీలక సన్నివేశాలను థాయ్‌లాండ్‌లో షూట్ చేసింది టీం. థాయ్‌లాండ్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలువబోతున్నాయట. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం టీజర్‌ను త్వరలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నిర్మాత హరికృష్ణ సోమిశెట్టికి డెబ్యూ సినిమానే అయినా భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం.
ఇంతకీ ది రెడ్ బ్యాగులో ఏముంది.. కబీర్ దుహన్ సింగ్ పాత్ర ఎలా ఉండబోతుందనేది మాత్రం సస్నెన్స్లో పెట్టేశారు మేకర్స్. ఈ మూవీకి రవికుమార్ సీరపు కథ, కథనం అందించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ది రెడ్ బ్యాగ్‌లో ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
That gold-butterfly Red Bag is definitely hiding something big 👀🩸#TheRedBag drops a killer concept poster — one frame packed with mystery, menace, and mood
“You don’t find the bag…
The bag finds you.”
And when it does,
it takes more than it gives.A bloodied hand, weapons… pic.twitter.com/MRWGyyLKPn
— Ramesh Bala (@rameshlaus) May 2, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

