నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో అధికారిక కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పేట్రేగిపోతున్నాయి. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తపై భద్రపై కాంగ్రెస్ నాయకుడు అంజి, అతని అనుచరులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. మక్తల్ పట్టణంలో భద్రను పట్టుకుని బైక్ చైన్‌తో తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో భద్ర తీవ్రంగా గాయపడ్డాడు.
తీవ్రంగా గాయపడిన భద్రను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా, కాంగ్రెస్ నాయకుడి దాడికి నిరసనగా మక్తల్ పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.