– హాజరుకానున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, కవి చింతల యాదగిరి
కోదాడ, ఏప్రిల్ 23 : “తెర” సాంస్కృతిక కళామండలి 33వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 26న కోదాడ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వేముల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు గురువారం కోదాడలో వార్షికోత్సవ వేడుకల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తెర కళా పురస్కారాన్ని” ప్రముఖ గాయకులు, సినీ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోకి తెర సాహితీ పురస్కారాన్ని ప్రముఖ గాయకుడు, రచయిత చింతల యాదగిరికి అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పద్మావతి, సన్మానకర్తగా సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్, వేనేపల్లి చందర్రావుతో పాటుగా ప్రముఖ సినీ హీరో జెమినీ సురేష్, నాన్నెందుకో వెనకబడ్డాడు రచయిత, సినీ దర్శకుడు ప్రకాష్ నాయుడు, ప్రముఖ జానపద గాయని సింగర్ శిరీష, భిక్షు నాయక్, బొల్లెద్దు శ్రీ పాల్, యాంకర్ సుజశ్రీ, జూనియర్ సూపర్ సింగర్, నేపధ్య గాయిని థామిని, పలువురు రంగస్థల కళాకారులు, నాట్యాచార్యులు, జానపద కళాకారులు పాల్గొంటున్నట్టు పేర్కొన్నారు. మూడు గంటల పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలతో కళాభిమానులను ఆకట్టుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మీరా, పోలిశెట్టి బ్రహ్మం, పాలూరి సత్యనారాయణ, యాకూబ్, దర్శకులు తిరూప్, పురుషోత్తం, కోలా శ్రీనివాసరావు, డాన్స్ మాస్టర్ నాగేశ్వరరావు, సతీష్ పాల్గొన్నారు.