Passengers | ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజా రవాణా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. రోజూవారి పనుల నిమిత్తం వెళ్లేవారితోపాటు ముఖ్యంగా అత్యవసర వైద్య సేవల కోసం ఆస్పత్రులకు వెళ్లాల్సిన వారు ప్రయాణానికి ఆటోడ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు అడిగినంత ఇచ్చుకోలేక దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు.
సమ్మె ఎఫెక్ట్ తో ఇబ్బంది పడుతున్న మహిళ ఒకరు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మనిషైతే ఫ్రీ బస్సులన్నీ రద్దు చేయాలి. మహిళల ప్రభుత్వం అనేది అపోహ అని రేవంత్ రెడ్డి మహిళల ప్రభుత్వం అంటూ దొబ్బి తింటున్నడు. మహిళల పేరు చెప్పి అడ్డంగా దోచుకుంటున్నాడని మండిపడ్డది. ఫ్రీ బస్సు అంటూ మాకు ఎక్కడ మిగులుతున్నయి. ఆస్పత్రుల్లో ఎన్ని డబ్బులు పోతున్నయి. అడ్డమైన రోగాలొస్తున్నాయి. అదేదో ఆస్పత్రుల్లో ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వమనండి. రేవంత్రెడ్డి ఓ వైపు ఉచితం అంటూనే మరోవైపు రేట్లు పెంచుతున్నడు. ఫ్రీ బస్సులు అంటే.. మరి మూడు రోజుల నుంచి బస్సులు ఎక్కడున్నయ్. కేసీఆర్ ఉన్నప్పుడు ఏదీ ఎక్కువ ధరలు ఏం లేవంటూ మండిపడ్డది.
మరో పెద్దావిడ మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు వల్ల తెలంగాణ అంతా ఆగం అయిందని.. ఎందుకు పెట్టిండో ఏమోనని మండిపడ్డది. గతంలో ఫ్రీ బస్సు లేకున్నా మేము టికెట్ తీసుకుని బతకలేదా..? నడిపితే అన్ని బస్సులు నడపాలి లేకపోతే మొత్తం ఆపేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఘట్కేసర్ నుంచి వస్తున్నా.. మల్లారెడ్డి ఆస్పత్రికి పోవాలే.. బస్సులు బంద్ చేస్తే మొత్తమే చేయాలె. నడుస్తుయని వచ్చిన. మల్లారెడ్డి ఆస్ప్రతికి పోవాలంటే రూ.400 అడుగుతుండు. సూరారం దిగుతా అంటే నర్సాపూర్ బస్సులు ఒకటి కూడా రావడం లేదంటూ వాపోయింది.
.
ఫ్రీ బస్సు వల్ల తెలంగాణ అంతా ఆగం అయింది, ఎందుకు పెట్టిండో ఏమో
గతంలో ఫ్రీ బస్సు లేకున్నా మేము టికెట్ తీసుకుని బతకలేదా?
నడిపితే అన్ని బస్సులు నడపాలి లేకపోతే మొత్తం ఆపేయాలి, ఇట్ల చేస్తే బస్సులు నడుస్తున్నాయని మేము బయటికి వస్తున్నాము https://t.co/Zcz8EvSmBy pic.twitter.com/uhqF9bammf
— Telugu Scribe (@TeluguScribe) April 23, 2026
రేవంత్ రెడ్డి మనిషైతే ఫ్రీ బస్సు రద్దు చేయాలి
మహిళల పేరు చెప్పి రేవంత్ రెడ్డి అడ్డంగా దోచుకుంటున్నాడు
కోటీశ్వరులను చేయడం కాదు అందరినీ బికారులను చేస్తాడు
వాడు ఏం చేయడు వానికి ఏ పని చేతకాదు https://t.co/Zj8S9pDQ2V pic.twitter.com/Z1ZJ7K7ctq
— Telugu Scribe (@TeluguScribe) April 23, 2026
Vijayawada Court | కోర్టులో న్యాయవాదులకు తప్పిన ప్రమాదం.. గాలి ఆడక ఇబ్బందులు పడ్డ లాయర్లు
పశువుల కడుపుల్లోకి ప్లాస్టిక్ వ్యర్ధాలు
Viral news | పెళ్లి పీటలపై నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి కొత్త పెళ్లికొడుకు.. Video