చాంగ్వాన్: భారత వెటరన్ షూటర్ మిరాజ్ అహ్మద్‌ఖాన్ కొత్త చరిత్ర లిఖించాడు. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ స్కీట్ ఈవెంట్లో పసిడి పతకం గెలిచిన తొలి భారత షూటర్‌గా మీరాజ్ రికార్డుల్లోకెక్కాడు. సోమవారం జరిగిన ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 40 షాట్లతో కూడిన తుది పోరులో మిరాజ్ 37 స్కోరుతో టాప్‌లో నిలువగా, మిన్సు కిమ్ (36), బెన్ లెవ్లిన్ (26) ఆ తర్వాత స్థానాలతో రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఈ క్రమంలో మిరాజ్ తన కెరీర్లో వ్యక్తిగత విభాగంలో తొలి స్వర్ణాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రిపొజిషన్లో అంజుమ్ మౌద్గిల్, అశి చౌక్సె, సిఫ్ట్ కౌర్‌తో కూడిన భారత బృందం కాంస్య పతకం సొంతం చేసుకుంది.