Sitara Gets Emotional | సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా మహేష్‌బాబు కూతురు సితార.. నానమ్మ మృతిని జీర్ణించుకోలేకపోతుంది. ఇందిరాదేవి భౌతికకాయం దగ్గర మహేష్‌పై కూర్చొని ఆమెను తల్చుకుంటూ కన్నీటి పర్యంతమవుతుంది. మహేష్ బాబు ఓదార్చిన గాని, సితార దు:ఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Stay Strong #Sitara & @urstrulyMahesh 🥺💔#RIPIndiraDeviGaru pic.twitter.com/gpU4JCtsa6
— Praveen Yadav 💫 (@praveenyadav_99) September 28, 2022
గత కొంత కాలంగా వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఇందిరాదేవి బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచింది. ఈమె మరణం పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. పలువురు సినీనటులు, రాజకీయ నాయకులు ఇందిరా దేవి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. సినీ నటులు వెంకటేష్, రాజశేఖర్, జీవిత, బండ్లగణేష్, దర్శకులు కొరటాల శివ, తివిక్రమ్, నిర్మాత అశ్వినీదత్ ఇందిరాదేవి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ పలువురు సినీ నటులు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు.