మహేష్‌బాబుతో రాజమౌళి రూపొందిస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా సోషల్‌మీడియాలో హై అటెన్షన్‌ను క్రియేట్ చేస్తున్నది. బాహుబలి ఫ్రాంఛైజీ, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల తర్వాత దర్శకధీరుడి నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌పై హైప్ నెలకొని ఉంది. ఈ నెల రెండోవారంలో హైదరాబాద్‌లో నిర్వహించే భారీ ఈవెంట్లో సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేస్తారని సమాచారం.
భారతీయ పురాణాలతో ముడిపడిన సాహసగాథగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, దీనికి ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారని గతకొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ఈ కథలో వారణాసి నేపథ్యానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందని, హైదరాబాద్‌లో వేసిన వారణాసి సెట్లో కీలక ఘట్టాలను తెరకెక్కించారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ‘వారణాసి’ టైటిల్‌నే ఖరారు చేశారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. కథలోని ఆధ్యాత్మిక అంశాల దృష్ట్యా ఇదే టైటిల్ యాప్ట్‌గా ఉంటుందని, దీనికి గ్లోబల్ రీచ్ కూడా వస్తుందనే ఆలోచనతో రాజమౌళి అదే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారని బాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. ఓ నిర్మాణ సంస్థ ఈ టైటిల్‌ను రిజిష్టర్ చేసుకున్నప్పటికీ.. వారిని సంప్రదించి టైటిల్‌ను సొంతం చేసుకున్నారని బాలీవుడ్లో ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. యస్యస్ఎమ్బీ29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే వారణాసి, కెన్యా, హైదరాబాద్‌లలో కీలక షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది.