ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను వెళ్లగొడితే అప్పుడు ముంబై, థానే లాంటి నగరాల్లో ఏమాత్రం డబ్బులు ఉండవని ఆయన అన్నారు. అంథేరిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గుజరాతీలు, రాజస్థానీలు ముంబై నుంచి వెళ్లిపోతే అప్పుడు ఆ నగరం ఆర్థిక రాజధానిగా ఉండబోదన్నారు. అయితే గవర్నర్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలను శివసేన పార్టీ ఖండించింది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ గవర్నర్ తీరును తప్పుపట్టారు. గవర్నర్ వ్యాఖ్యలను సీఎం షిండే ఖండించాలని ఎంపీ సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ స్పాన్సర్ చేసిన సీఎం అధికారంలో ఉన్నారని, అందుకే మరాఠీలకు అవమానం జరుగుతోందని రౌత్ ఆరోపించారు.
#WATCH | If Gujaratis and Rajasthanis are removed from Maharashtra, especially Mumbai and Thane, no money would be left here. Mumbai would not be able to remain the financial capital of the country: Maharashtra Governor Bhagat Singh Koshyari pic.twitter.com/l3SlOFMc0v
— ANI (@ANI) July 30, 2022