Premante | ప్రియదర్శి, ఆనంది కాంబోలో వచ్చిన చిత్రం ‘ప్రేమంటే’. ‘థ్రిల్ యూ ప్రాప్తిరస్తు’ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ చిత్రాన్ని నవనీత్ శ్రీరామ్ డైరెక్ట్ చేశాడు. పాపులర్ యాంకర్ సుమ కీలక పాత్రలో నటించింది. నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇక ఓటీటీలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది.
పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో 2025 డిసెంబర్ 19న ప్రీమియర్ కానుంది. తెలుగు వెర్షన్‌తోపాటు తమిళం, కన్నడ, మలయాళ డబ్బింగ్ వెర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఓటీటీలో ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందని ఆసక్తికరంగా మారింది.
ఈ మూవీలో వెన్నెల కిశోర్ కీ రోల్ చేశాడు. లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు . ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించగా.. నవనీత్ శ్రీరామ్ రైటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు.
మీకేం అంచనాలు లేవు.. మ్యారేజ్ లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ అని ఆనందిని అడుగుతుంటే..ఉదాహరణకు నేను పెళ్లి చేసుకునే అమ్మాయికి నా వళ్ల ఎలాంటి సమస్యలు రాకూడదని నేనుకుంటా అని ప్రియదర్శి అంటాడు. ఇక పెళ్లి తర్వాత లైఫ్ థ్రిల్లింగ్‌గా ఉండాలి అంతే.. రోజంతా కోట్లాడుకున్నా.. ఎంత కోపమొచ్చినా.. కూర్చొని చాయ్ తాగుతూ మాట్లాడుకొని సాల్వ్ చేసి ప్రేమతోనే పడుకోవాలి. అట్లాంటి పెళ్లి కావాలి నాకు అంటుంది ఆనంది.
ఇక రమ్య సెకండ్ సెటప్ లాంటిదేమి లేదు ప్లీజ్ అంటాడు ప్రియదర్శి. మొత్తానికి పెళ్లికి ముందు భిన్న అభిప్రాయాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు.. పెళ్లి తర్వాత భార్యభర్తలుగా మారాక ఎలాంటి సంఘనలు జరిగాయనే నేపథ్యంలో ఫన్, సీరియస్ ఎలిమెంట్స్‌తో సాగుతుంది.
#Premante on Netflix, 19th December.
In Telugu, Tamil, Malayalam, Kannada. pic.twitter.com/ufoW7cPZYN
— OTT Gate (@OTTGate) December 14, 2025