అమరావతి : నెల్లూరు రాజకీయాలు ( Nellore Politics ) శరవేగంగా మారుతున్నాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 54 మంది కార్పొరేటర్లు ఉండగా అందరూ వైసీపీ( YCP ) కి చెందిన వారే ఉండడం గమన్హారం.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు అనేక మంది తమ పదవులకు రాజీనామా చేసి కూటమి పార్టీల్లో చేరారు. అందులో భాగంగా నెల్లూరు నగర పాలక పరిధిలో ఉన్న 54 మందిలో 42 మంది వైసీపీ సభ్యులు టీడీపీలో చేరారు.
అప్పటి నుంచి మేయర్ పదవిని దక్కించుకోవడం కోసం ఎదురుచూస్తున్న సభ్యులకు అవిశ్వాస సమయం రావడంతో కూటమి ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రి వేగంగా రాజకీయ పావులు కదల్చటం మొదలు పెట్టారు. వైసీపీకి సంఖ్యబలం లేకపోవటంతో ప్రస్తుతమున్న మేయర్ పొట్లూరు స్రవంతి( Mayor Sravanthi ) తన పదవికి రాజీనామా చేశారు.
ఈనెల 18న అవిశ్వాస తీర్మానానికి ముందుగానే ఆమె మేయర్ పదవికి శనివారం రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం స్వయంగా వెళ్లి జిల్లా కలెక్టర్కు రాజీనామా పత్రాన్ని అందజేస్తానని ప్రకటంచారు. అయితే ఆదివారం కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్కు వాట్సాప్లో పంపారు. ఆమె రాజీనామా ఆమోదంపై నెల్లూరు ఉత్కంఠ నెలకొంది.