ప్రధాని మోదీ నేడు మహారాష్ట్ర సీఎం భేటీ
ప్రధాని మోదీ నేడు మహారాష్ట్ర సీఎం భేటీ | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు.

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. మరాఠా, ఓబీసీ రిజర్వేషన్లు, తౌక్టే తుఫాను సాయం, టీకాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. మంత్రులు అజిత్ పవార్, అశోక్ చవాన్‌లు సైతం భేటీలో పాల్గొన్ననున్నారు. మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గత నెల సంచలన తీర్పు ఇచ్చింది. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. మరాఠా రిజర్వేషన్లు.. రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు రిజర్వేషన్లపై ఉద్ధవ్ ఠాక్రే ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మరాఠా సమాజాన్ని ఎస్ఈబీసీ (సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారు)గా ప్రకటించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
పిల్లలపై టీకా ట్రయల్స్
కమలంలో యూపీ దడ!
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఆలస్యం!
విమానంలో కుదుపులు.. ముగ్గురికి గాయాలు
పిడుగులకు 26 మంది బలి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

