మరికల్, మార్చి 15 : మండలంలో ని చిత్తనూరలో ఏర్పాటు చేస్తున్న జూరా ల ఆగ్రో బయో డిజిల్ కంపెనీ ప్రాజెక్టు మాకొద్దంటూ మంగళవారం గ్రామ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో యువకులు తీర్మానం చేశారు. అనంతరం ప్రాజెక్టు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భం గా సర్పంచ్ అరుంధతీ, ఎంపీటీసీ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ బయో డిజిల్ కంపెనీ ఏర్పా టు వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతాయని, పర్యవరణం లోపిస్తుందని, పంట పొలాలు దెబ్బ తిం టాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులంతా ప్రాజెక్టు వద్ద ధర్నా చేపట్టడంతో ఎస్సై అశోక్‌బా బు ఆందోళనకారులను సముదాయించారు.
కంపె నీ వారు పనులను నిలిపివేసే వరకు ధర్నాను కొనసాగిస్తామన్నారు. కంపెనీ సిబ్బంది గ్రామస్తులతో మాట్లాడుతూ కంపెనీకి అన్ని అనుమతులు ఉన్నాయని, పనులు నిలిపివేయడం కుదరదన్నారు. వి డుతల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కంపెనీ పనులు నిలిపే వరకు ఉద్యమిస్తామని గ్రా మస్తులు అన్నారు. పనులు నిలిపివేయాలని కంపె నీ సిబ్బందికి పలు డిమాండ్లతో కూడిన వినతిప త్రం అందజేశారు. కంపెనీ ఏర్పాటు వల్ల 29 గ్రా మాలకు నష్టం వాటిల్లుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యువకులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.