మూసాపేట, మార్చి 14 : దేవరకద్ర, కొత్తకోట పట్టణాల్లో డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవరకద్ర, చిన్నచింతకుంట, అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాలకు చెందిన విద్యార్థులు డిగ్రీ చదివేందుకు మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా, కొత్తకోట, మదనాపురం విద్యార్థులు వనపర్తికి వెళ్తున్నట్లు తెలిపారు. కళాశాలలకు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేవరకద్ర, కొత్తకోట పట్టణాలకు డిగ్రీ కళాశాలలను మం జూరు చేయాలని కోరారు. దీనిపై మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కళాశాలల మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు.
బాధితుడికి పరామర్శ
దేవరకద్ర రూరల్, మార్చి 14 : మండలంలోని వెంకంపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు తిరుపతిరెడ్డి కుమారుడు రమేశ్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం దవాఖానకు వెళ్లి రమేశ్‌రెడ్డిని పరామర్శించారు. అతడికి మెరుగైన వైద్యం అందించాలని దవాఖాన వైద్యులకు సూచించారు.