భూత్పూర్, మార్చి 10 : ముఖ్యమం త్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశంలోనే బృహత్తరమైనదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అ న్నారు. మున్సిపాలిటీలోని కేఎంఆర్ ఫంక్షన్హాల్లో నియోజకవర్గంలోని దళితబం ధు లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దళితబంధు పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు ఇచ్చి ఆర్థికంగా చేయూతనందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.10లక్షలను ఏడాది లో రూ.20లక్షలు చేసే దిశగా కష్టపడాలని లబ్ధిదారులకు సూచించారు. లబ్ధిదారులు ఎంచుకున్న పనిలో నైపుణ్యాన్ని పెంచుకొని ఆశించిన ఫలితాలు సాధించాలని తె లిపారు. అనంతరం వివిధ శాఖల అధికారులు అవగాహన కల్పించారు. జిల్లా కేం ద్రంలో 15నుంచి 17వ తేదీవరకు యూ నిట్లవారీగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
చెక్కులు పంపిణీ
దేవరకద్రకు చెందిన పాండు ఇటీవల విద్యుదాఘాతంతో మృతి చెందాడు. అత డి కుటుంబానికి విద్యుత్ శాఖ నుంచి మంజూరైన రూ.5లక్షల చెక్కును ఎమ్మె ల్యే ఆల అందజేశారు. అలాగే మూసాపేట మండలం సంకలమద్దికి చెందిన చెన్నమ్మకు ఎస్పీ కార్పొరేషన్ నుంచి మంజూరైన రూ.లక్ష చెక్కును అందజేసి అభినందనలు తెలిపారు. అదేవిధంగా చిన్నచింతకుంట మండలం ఉంద్యాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ఆంజనేయులు ఇటీవల మృతి చెందగా, అతడి కుటుంబసభ్యులకు రూ.2లక్షల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. అలాగే ఐకేపీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వీబీకేలు ఎమ్మెల్యే ఆలకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమం లో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్యగౌడ్, ఎంపీపీలు కదిరె శేఖర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, రమాశ్రీకాంత్యాదవ్, కళావతి, జెడ్పీటీసీలు ఇంద్రయ్యసాగర్, రాజేశ్వరి, అన్నపూర్ణ, ఎంపీడీవోలు ము న్ని, శ్రీనివాసులు, శ్రీనివాస్‌రెడ్డి, మంజు ల, ఉమాదేవి పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
మూసాపేట(అడ్డాకుల), మార్చి 10 : మండలంలోని కందూరు రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. 14నుంచి ఏప్రిల్ 10వ తేదీవరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, సర్పంచ్ శ్రీకాంత్, రమేశ్‌గౌడ్ ఉన్నారు.