హన్వాడ, మార్చి 10 : రాష్ట్రంలో ఉద్యో గ నియామకాల ప్రక్రియను పెద్దఎత్తున చేపడుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చారిత్రాత్మకమని టీఆర్ఎస్ ఎస్సీసెల్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రామాంజీ, ఆంజనేయులు అన్నారు. మండలకేంద్రంలోని గ్రా మపంచాయతీ కార్యాలయం వద్ద బుధవా రం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బా లకిష్టయ్య, మాజీ ఎంపీటీసీ నాగన్న, టీఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి జంబుల య్య, ఆశన్న, బాలకిష్టయ్య, లక్ష్మయ్య, వెం కటయ్య, అంజి, యాదయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు యూనివర్సిటీలో..
మహబూబ్‌నగర్‌టౌన్, మార్చి 10 : ఉద్యోగ నియామకాలను పెద్దఎత్తున చేపడుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పాలమూరు యూనివర్సిటీలో సంబురాలు నిర్వహించా రు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ పీయూ ఇన్చార్జి, జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాబిషేకం చేశారు. కార్యక్రమంలో నరేశ్, కార్తిక్, సందీప్, రమేశ్, పవన్, విఘ్నేశ్ తదితరులు పాల్గొన్నారు.
నాలుగోవార్డు ఎదిరలో..
మహబూబ్గర్టౌన్, మార్చి 10 : జిల్లాకేంద్రంలోని నాలుగోవార్డు ఎదిరలో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించా రు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ యాద మ్మ, మాజీ కౌన్సిలర్ శివశంకర్, సూద నర్సింహులు, వెంకటయ్యగౌడ్, ఎల్లయ్య, పెద్దకృష్ణ, బీ.శ్రీనివాసులు, నవకాంత్రెడ్డి, భానుచందర్, వీరస్వామి, శ్రీకాంత్, శంక ర్, మోహన్, శ్రీశైలం, శేఖర్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
భారీగా ఉద్యోగ అవకాశాలు
బాలానగర్, మార్చి 10 : ఉద్యోగ నియామకాలను పెద్దఎత్తున చేపడుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని గిరిజన నాయకుడు లక్ష్మణ్‌నాయక్ అన్నారు. మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సీఎం నిర్ణయంతో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. రిజర్వేషన్ల ప్రకారం గిరిజన నిరుద్యోగులకు సుమారు 5వేల ఉద్యోగాలు కల్పించడం సంతోషంగా ఉందని, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే జెడ్పీటీసీ కల్యాణి హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో సర్పంచ్ తిరుపతినాయక్, లక్ష్మణ్‌నాయక్ తదితరులు ఉన్నారు.