జడ్చర్లటౌన్, మార్చి 9 : హరితహారం కార్యక్రమం లో భాగంగా మహబూబ్‌నగర్-జడ్చర్ల ప్రధానరహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఆదేశించారు. జడ్చర్లలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద సుందరీకరణ పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్చర్ల-మహబూబ్‌నగర్ ప్రధానరహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను చూశారు. జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రి డ్జి గోడలకు పెయింటింగ్ పనులను త్వరగా పూర్తి చే యించి పొడవాటి మొక్కలు నాటించాలని సూచించా రు. బ్రిడ్జి వద్ద తోపుడుబండ్లను తీయించాలని మున్సిప ల్ కమిషనర్ సునీతను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
మహబూబ్‌నగర్‌టౌన్, మార్చి 9 : జిల్లా అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ లెవెల్ సైబర్హుడ్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్‌ను కలెక్టర్‌తోపాటు జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ, పార్లమెంట్ల్లో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రాముఖ్యతను తెలియజేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం ఉత్తమ యువజన సంఘంగా ఎంపికైన మరికల్ మండలికి సర్టిఫికెట్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో 8వ బెటాలియన్ కల్నల్ ఎంవైకే రావు, నెహ్రూ యువకేంద్రం కోఆర్డినేటర్ కోటానాయక్, ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, జెడ్పీసీఈవో జ్యోతి, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ లయన్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటాలి
ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌ రస్తా, హౌసింగ్‌బోర్డు కాలనీ, బైపాస్‌రోడ్డులో మొక్కల ను పరిశీలించారు. చౌరస్తాలతోపాటు రోడ్లకు ఇరువైపు లా, సెంట్రల్లైన్లో మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించారు. భవన ఆవరణలో సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే క్లాక్‌టవర్‌లో మార్కెట్ నిర్మించనున్న స్థలాన్ని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, ఎంఈ సుబ్రహ్మణ్య డీఈలు బెంజిమె న్, సూర్యనారాయణ, టీపీవో ప్రతాప్‌కుమార్, సీసీ నవీ న్, ఆర్అండ్బీ ఈఈ స్వామి, డీఈ సంధ్య ఉన్నారు.
మనఊరు-మనబడిపై నిర్లక్ష్యం వద్దు
మనఊరు-మనబడి, మనబస్తీ-మనబడి కార్యక్రమంపై నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని కలెక్టర్ ఎస్.వెంకట్రావు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మనబస్తీ-మనబడిపై సమీక్షించారు. మనబస్తీ-మనబడికి సంబంధించి ప్రణాళిక రూపొందించకపోవడంపై హెచ్ఎం ఇమాన్యుల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట డీఈవో ఉషారాణి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ ఉన్నారు.