మూసాపేట(అడ్డాకుల), మార్చి 9 :మధ్యాహ్న భోజనం వికటించి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన బుధవారం చోటుచేసుకున్నది. అడ్డాకుల మండలంలోని పెద్దమునగల్‌చేడ్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన కొంత సమయానికి 30 మంది విద్యార్థులు వాంతులు, నీరసంతో అస్వస్థతకు గురైయ్యారు. పాఠశాల అధ్యాపకులు ఇచ్చిన సమాచారం మేరకు వారిని వెంటనే అడ్డాకుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విష యం తెలిసిన జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి సమాచారం ఇవ్వడంతో మండల, జిల్లా వైద్యులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా దవాఖానకు వెళ్లి వి ద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులతో మాట్లా డి వారికి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే ఆల కో రారు. అయితే 17 మంది విద్యార్థులు అడ్డాకుల పీహెచ్‌సీలోనే వైద్యం సేవలు అందించగా, 13 మంది విద్యార్థులను మాత్రం జిల్లా దవాఖానకు తరలించారు.
విషయంపై కలెక్టర్ వెంకట్రావు కూడా స్పందించి వైద్యులను అప్రమత్తం చేసి మెరుగైన వైద్యం అందించడంతోపాటు, పిల్లలు తిన్నటు వంటి భోజనాన్ని పరీక్షించి, ఎందువల్ల పిల్లలకు అస్వస్థత అయిందో గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో డిప్యూటీ డీఎంహెచ్‌వో అడ్డాకుల దవాఖానకు సందర్శించి న అక్కడున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థులు తిన్నటువంటి భో జనం అక్షయ పాత్ర పథకం ద్వారా నవాబ్‌పేట నుంచి ప్రతిరోజూ వస్తున్నదన్నారు. అ యితే పిల్లలు తిన్నటువంటి పెరుగు ప్యాకె ట్లు గడువు ముగిసి ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా ఘటనా స్థలానికి తాసిల్దార్ కిషన్, ఎంఈవో నాగయ్య, టీపీసీసీ కార్యదర్శి మ ధుసూదన్రెడ్డి తదితరులు వెళ్లి విద్యార్థుల పరిస్థితిపై ఆరా తీశారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శశికాంత్ మాట్లాడుతూ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు, అయితే ఎందువల్ల అయిందనే విషయం పరీక్షలు నిర్వహిస్తే తెలుస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అయితే పిల్లలందరీ ఆ రోగ్య పరిస్థితి బాగున్నట్లుగా తెలిపారు.
విద్యార్థులందరూ క్షేమం
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, మార్చి 9 : మధ్యాహ్న భో జనం వికటించిన ఘటనలో విద్యార్థులందరూ క్షేమంగా ఉ న్నారని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. 13 మంది విద్యార్థులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానకు వై ద్య సేవల నిమిత్తం ఇక్కడ తరలించగా వారిని కలెక్టర్ పరి శీలించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొని ప్రత్యేక వార్డులోకి మార్చి మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యాధికారులకు సూచించారు. పిల్లల ఆరోగ్య విషయంలో ఎలాంటి ఆందోళన లేదని, విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యసేవల నిమిత్తం విద్యార్థుల తమ సంరక్షణలో ఉన్నారని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.