మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, మార్చి 9 : రాష్ట్రంలో 92,142 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా విద్యార్థులు స్వీట్లు పంచుకొని పటాకులు కాల్చారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్‌రెడ్డి, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శివకుమార్, పీయూ టీఆర్ఎస్ నాయకులు వినోద్, పవన్, వినయ్, శ్రీకాంత్, బాలు, భాను, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్లటౌన్, మార్చి 9 : జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. అలాగే అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చారు. నిమ్మబావిగడ్డ వద్ద టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్‌చందర్, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు నవీన్‌చంద్రారెడ్డి, నాయకులు దోరేపల్లి రవీందర్, శ్రీకాంత్, నాగిరెడ్డి, ఇంతియాజ్, శంకర్‌నాయక్, రామ్మోహన్, ప్రశాంత్‌రెడ్డి, రమేశ్, పర్మటయ్య, కృష్ణారెడ్డి, జీసీ.కాలేబ్, పర్వత్‌రెడ్డి, సతీశ్, శ్యామ్, కొండల్, నర్సింహయాదవ్, బాలు, వీరేశ్, మొఖిద్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, మార్చి 9 : ఉద్యోగ నియామకాలపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మండలకేంద్రంలో ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులు సంబురాలు జరుపుకొన్నారు. బస్టాండ్ చౌరస్తాలో పటాకులు కాల్చడంతోపాటు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, రై తుబంధు సమితి మండల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, స ర్పంచులు గోపాల్‌గౌడ్, యాదయ్యయాదవ్, కోఆప్షన్ స భ్యుడు తాహెర్, ప్రతాప్, మెండె లక్ష్మయ్య, గండు చెన్న య్య, యూత్వింగ్ అధ్యక్షుడు మెండె శ్రీను, ప్రకాశ్, ఫయా జ్, నర్సింహులు, సత్యం, సాయిబాబా పాల్గొన్నారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, మార్చి 9 : ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవడంపై మండలకేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకొన్నారు. ఈ సం దర్భంగా పటాకులు కాల్చి సీఎం కేసీఆర్ కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీసీఎస్ వైస్చైరన్ లక్ష్మీనారాయణ, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, సర్పంచులు చంద్రకళ, హన్మంతు, డైరెక్టర్ వెంకటయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యానాయక్, యూత్ అధ్యక్షుడు వెంకట్రాములు, రాంచంద్రారెడ్డి, వెంకట్‌రెడ్డి, జోగు కృష్ణ, దశరథ్, రమేశ్‌రెడ్డి, భీమయ్య పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, మార్చి 9 : ఉద్యోగ ఖాళీల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడాన్ని హర్షిస్తూ మండలకేంద్రంలోని చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బీ.కృష్ణయ్య, శ్రీనివాస్‌రెడ్డి, మల్లయ్య, భీంరెడ్డి, గిరిధారి నాగయ్య, రాజవర్ధన్‌రెడ్డి, కృష్ణయ్యయాద వ్, టీవీ ఖాజా, నవాజ్, లక్కీగౌడ్, నజీమ్, నారాయణరెడ్డి, మహేశ్, శ్యామ్, జూనియర్ కళాశాల సూపరింటెండెంట్ హ రీశ్రెడ్డి, అధ్యాపకుల సంఘం నాయకులు అరవింద్, రజిత, పారిజాత, చంద్రమౌళి, భీంరెడ్డి, ప్రవళిక పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, మార్చి 9 : మండలకేంద్రంలో ఎంపీ పీ రమాదేవి ఆధ్వర్యంలో యువత సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
భూత్పూర్ మున్సిపాలిటీలో..
భూత్పూర్, మార్చి 9 : మున్సిపాలిటీలోని చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, బాలకోటి, రామకృష్ణ, కోఆప్షన్ సభ్యుడు అజీజ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, సత్తూర్ నారాయణగౌడ్, సత్యనారాయణ, గడ్డంరాములు, బోరింగ్ నర్సింహులు, మాధవరెడ్డి, ప్రేమ్‌కుమార్, వెంకటేశ్, సురేశ్‌గౌడ్, రాకేశ్ పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, మార్చి 9 : మండలంలోని కొత్తపల్లిలో టీఆర్ఎ స్ నాయకులతో కలిసి యువత సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కుమార్, వెంకటయ్య, రాములు, సత్యం, యాదయ్య, ఆంజనేయులు, రాజు, శివకుమార్, రాఘవేందర్, కృష్ణ య్య, సురేశ్, వెంకటయ్య, మల్లేశ్, శివ, వేణు పాల్గొన్నారు.
త్వరలోనే ఉద్యోగ నియామకాలు
ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, మార్చి 9 : ప్రభుత్వ శాఖల్లోని అన్ని ఖాళీల భర్తీకి ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నదని మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో 92,142 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం బాదేపల్లి మార్కెట్‌యార్డులో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీళ్లు, నిధు లు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని, ఇప్పటికే నిధులు, నీళ్లను సాధించామని తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయనున్నట్లు తెలిపారు. పెద్దమొత్తంలో ఉద్యోగాల భర్తీని ప్రకటించడం హర్షణీయమన్నారు.
సీఎం ప్రకటన హర్షణీయం
బాలానగర్, మార్చి 9 : ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని టీఆర్ఎస్ యూత్వింగ్ మండల అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్ అన్నారు. మండలకేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మొత్తం 92,142 ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. సమాశంలో స ర్పంచ్ రమేశ్‌నాయక్, యూత్వింగ్ నాయకులు బాసూనాయక్, రామకృష్ణ, గురుపాదం తదితరులు ఉన్నారు.