మచ్చలేని నేతగా ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి పేరు తెచ్చుకున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. గురువారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా జడ్చర్లలో నిర్వహించిన కార్యక్రమాలకు మంత్రి హాజరయ్యారు. పలు చోట్ల టీఆర్ఎస్ పార్టీ నేతలు, అభిమానులతో కలిసి మంత్రి సమక్షంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యేకు మంత్రితోపాటు పార్టీనేతలు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 3 : జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను గురువారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి క్రేన్ సాయంతో గజమాల వేశారు. అనంతరం ప్రధానరహదారి పొడవునా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పటాకులు కాలు స్తూ.. పూలు చల్లుతూ ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులు బహుకరించిన తల్వార్‌ను ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి చేతబట్టుకుని అభివాదం చేశారు. అలాగే పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందిరానగర్‌కాలనీ, బేతని ఎంబీ చర్చి వద్ద కేకులు కట్ చేశారు.
ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేశారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్‌తోపాటు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత, కుమారుడు స్వరణ్, కుటుంబసభ్యుల సమక్షంలో భారీ కేక్‌ను ఎమ్మెల్యే కట్ చేశారు. అలాగే యాదాద్రి ఆలయ అర్చకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దంపతులను ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం జడ్చర్ల నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నేతాజీ చౌరస్తాలో ధూంధాం కార్యక్రమాన్ని నిర్వహించారు.
919మంది రక్తదానం
ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందం గా ముందుకొచ్చి రక్తదానం చేశారు. శిబిరంలో మొత్తం 919మంది రక్తదానం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా బా దేపల్లి ఉన్నత పాఠశాలలో కౌన్సిలర్ రఘురాంగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి వాలీబాల్, క్రికె ట్, ఫుట్‌బాల్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేతులమీదుగా బహుమతులను అందజేశారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, ఫిబ్రవరి 3 : మండలకేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, వైస్‌ఎంపీపీ సంతోష్‌రెడ్డి, రై తుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సర్పంచులు గోపాల్‌గౌడ్, యాద య్య, సత్యం, కారూర్ లక్ష్మారెడ్డి, వెంకటేశ్, ఎంపీటీసీలు రాధాకృష్ణ, గోపాల్, గోపీకృష్ణ, కోఆప్షన్ సభ్యుడు తా హెర్, నాగిరెడ్డి, ప్రతాప్, మెం డె లక్ష్మయ్య, చెన్నయ్య, అబ్దు ల్లా, రఘు, చందర్‌నాయక్, మెండె శ్రీను, సేవ్యానాయక్, దేపల్లి రాములు, శ్రీనివాస్‌రెడ్డి, భోజయ్య ఆచారి, వెంకటేశ్, కృష్ణగౌడ్, మల్లెపాగ నర్సింహులు, రవి పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, ఫిబ్రవరి 3 : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను మండలకేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బచ్చిరెడ్డి, నాయకులు నరహరి, మహిపాల్‌రెడ్డి, యాదగిరి, విజయ్, దేవేందర్, సత్యయ్య, ఆనంద్‌గౌడ్, వెంకట్రాంరెడ్డి. గోవింద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, ఫిబ్రవరి 3 : మండలకేంద్రంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శశిరేఖ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, సర్పంచ్ రాధికారెడ్డి, సుధాబాల్రెడ్డి, శ్రీనివాసులుగుప్తా, బాలు, జంగారెడ్డి, జైపాల్‌రెడ్డి, సుదర్శన్, వెంకట్‌రెడ్డి, బాలయ్య, దానియేలు, శ్రీనివాసులు, వెంకట్, ఆచా రి, బాబా, మల్లయ్య, వరుణ్‌రాజు, బంగారు, నవీన్ ఆచారి, శేఖర్, మతీన్, వీరేశ్, శ్రీనివాసులు, జగన్‌గౌడ్, కరుణాకర్‌రెడ్డి, విజయ్‌నాయక్ పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, ఫిబ్రవరి 3 : మండలకేంద్రంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులు, మహిళలకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్ణం శ్రీనివాసరావు, జెడ్పీటీసీ కల్యాణి చీరలను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర సహాయకార్యదర్శి వాల్యానాయక్, వైస్‌ఎంపీపీ వెంకటాచారి, లక్ష్మణ్‌నాయక్, రైతుబం ధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మం డల ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి, ఎంపీటీసీ లింగూనాయక్, సింగిల్‌విండో డైరెక్టర్ మంజూనాయక్, సర్పంచులు గోపీనాయక్, రమేశ్‌నాయక్, వెంకట్‌నాయక్, అప్సర్‌ఖాన్, రవికుమార్, కటికె రాజు, జమీరుల్లా పాల్గొన్నారు.
నోట్‌పుస్తకాలు పంపిణీ
జడ్చర్ల రూరల్, ఫిబ్రవరి 3 : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మండలంలోని గోప్లాపూర్‌లో సర్పంచ్ చెన్నయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివ, హెచ్ ఎం నేపాల్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు యాదయ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.