మహ్మదాబాద్, నవంబర్ 26 : అర్హులైన రైతులందరికీ రుణాలు ఇవ్వాలని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని సహకార సంఘం కోఆపరేటివ్ బ్యాంకులో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు రుణాలు ఇవ్వడంలో జాప్యం చే యొద్దన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు విడుతలవారీగా రుణాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులకు సూచించారు. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని కోరారు. సమావేశంలో పీఏసీసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్‌రెడ్డి, డీజీఎం సత్యప్రసాద్, ఏజీఎం సరిత, మేనేజర్ ఆంజనేయులు తదితరులు ఉన్నారు.