రాజాపూర్, జనవరి 18 : గ్రామీణ ప్రాంత రైతులు ము ఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడి పంటలను సాగు చేస్తా రు. ప్రకృతి కరుణించి మంచిగా పంట వస్తేనే చేతినిండా డ బ్బులు ఉంటాయి. లేదాంటే వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి రాక ఎంతో మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతారు. అందరి రైతుల మాదిరిగానే తిర్మలాపూర్ గ్రామానికి చెందిన సంతోశ్‌కుమార్ తనకున్న 13 ఎకరాల పొలం లో పత్తి, వరి పంట సాగు చేసిన ప్రతిసారి ఏదో ఒక విపత్తు వచ్చి తీవ్ర నష్టం వచ్చేంది. ఏమి చేయాలో అర్థం కాక పొ లాన్ని విక్రయించి పట్నం బాటపట్టాడు. అక్కడ తనకు తెలిసిన వారి ప్రోత్సాహంతో హైదరాబాద్ గట్కేసరి పరిసర ప్రాంతంలో కొంత భూమిని లీజుకు తీసుకొని షో గడ్డి పె ట్టాడు. షో గడ్డి సాగులో మంచి లాభాలు రావడంతో మరికొంత పొలాన్ని లీజుకు తీసుకొని గడ్డి సాగు చేయడంతో లాభాలు రావడం జరిగింది. ఎక్కడైతే పొలాన్ని విక్రయించాడో అక్కడే 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసి గడ్డి సాగు చేస్తున్న రైతుపై ప్రత్యేక కథనం…
మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన రైతు కట్టా సంతోశ్‌కుమార్ గ్రామంలో కిరాణం నడుపుతూ తనకున్న 13 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసి తీవ్రంగా నష్టపోయాడు. వ్యవసాయ అధారిత పంటలకు భిన్నం గా ఏదైనా కొత్త రకం వ్యవసాయం చేయాలనే తపన తో లాభాలు వచ్చే సాగుపై దృష్టి సారించాడు. తెలిసిన వారి సూచనలతో 15 ఏం డ్లుగా షో గడ్డి సాగు చేస్తూ ఆర్థికంగా ఎదిగాడు. గడ్డితోపాటు నర్సరీలను ఏర్పాటు చేసి రకరకాల మొక్కలను పెంచి మంచి లాభాలు గ డించాడు. ప్రతి ఆరునెలకు ఒకసారి గడ్డి చేతికి వస్తున్నది. గడ్డికి మార్కెట్లో ఫీట్‌కు రూ.10లు ఉంది. గడ్డికి పట్టణాలు, విదేశాల్లో మంచి డి మాండ్ ఉంది. షో గడ్డి మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నడు. తను చదువుకున్న పరిజ్ఞానంతో సంకేతికతను ఉపయోగించుకొని షో గడ్డిని విదేశాలకు ఎగుమతి చేసి మంచి లాభాలు ఆర్జిస్తున్నడు.
వందల మందికి ఉపాధి
గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీలకు పని లేక పట్నం పో యే వలస కూలీలకు ఉపాధి కల్పించాడు. ఇక్కడ దాదాపు 100 మందికిపై కూలీలకు ఏడాదంతా చేతినిండా పని ఉం టుంది. షో గడ్డి కట్ చేసి వెంటనే కొత్త గడ్డి పెట్టాడం. దా నిని శుభ్రం చేసి మళ్లీ నాటడం, కలుపు తీయడం వంటి పనులు ప్రతి నిత్యం ఉంటాయి.
పోయిన దగ్గరే వేతుకోవాలి
చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ప్రా ణం. గ్రామంలో అందరి రైతుల మాదిరిగానే వ్య వసాయం చేసి తీవ్రంగా నష్టపోయాను. పొలాన్ని అమ్ముకొని అప్పులు చె ల్లించాను. వ్యవసాయంపై మమకారం చావక ఎలాగైనా మళ్లీ వ్యవసాయం చేయాలనే తపనతో షో గడ్డి పెంపకం ప్రా రంభించాను. వ్యవసాయానికి దీటుగా షో గడ్డి పెంప కంతో లాభాలు రావడంతో పోగొట్టుకున్న చోటనే మళ్లీ భూమిని కొని గడ్డిని పెంచుతున్నాను.