శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది. జానకిరామ్ మారెళ్ల దర్శకుడు. మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. 1992 ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దు నేపథ్యంలో ఈ కథ సాగినట్లుగా చూపించారు.
ఓ లోకల్ థియేటర్‌ను నడుపుకునే కల్యాణ్ జీవితంలోకి ఒడిశాకు చెందిన ఓ అమ్మాయి వస్తుంది. అయితే భాషా సమస్య వీరి ప్రేమకు అడ్డంకిగా మారుతుంది. ఇంతలో కల్యాణ్ కోసం పోలీసులు వేట మొదలుపెడతారు. అతను మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ అని ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో జైలులో ఉన్న తన సహచరుల్ని విడిపించడానికి కల్యాణ్ ఏం చేశాడనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. మహిమా నంబియార్, రాధిక శరత్‌కుమార్, షైన్‌టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, నిర్మాతలు: వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి, దర్శకత్వం: జానకిరామ్ మారెళ్ల.