చారకొండ, అక్టోబర్ 3 : దసరాకు ముందే దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేలా సీఎం కేసీఆర్ లబ్ధిదారులకు యూ నిట్లు అందజేశారు. మండలంలోని 1,407 లబ్ధిదారులను ఎంపిక చేశారు. సోమవారం మండలంలోని జూపల్లిలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈసందర్భంగా 304మంది లబ్ధిదారులకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎంపీ రాములు, కలెక్టర్ ఉదయ్‌కుమార్, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కశిరెడ్డినారాయణరెడ్డి యూనిట్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని జూపల్లి, జేపల్లి, గోకారం, చంద్రాయన్పల్లి, ఎర్రవల్లి, శేరిఅప్పారెడ్డిపల్లి గ్రామాల్లో మొత్తం 676 కుటుంబాలు ఎంపిక చేశారు. వారిలో 304 కుటుంబాలకు రూ.30కోట్ల9లక్షల60వేలు సంబంధించిన యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. ఆరు గ్రామాల్లో 9 రకాల యూనిట్లు 145 ట్రాక్టర్లు, 45 ప్యాసింజర్ కార్లు, రవాణా వాహనాలు, 21సెంట్రింగ్ మెటీరియల్, 7 టెంట్‌హౌస్‌లు, 1 కాంక్రీట్ మిక్సర్, 46 మినీ డైరీ యూనిట్లు, 9 గొర్రెల యూనిట్లు, 8 పౌల్ట్రీ యూనిట్లు, జేసీబీ పం పిణీ చేశారు. మిగతా వారికి త్వరలోనే అం దజేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, టీఆర్ఎస్ రాష్ట్ర నేత గోళి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ నిర్మలావిజేందర్గౌడ్, వైస్ ఎంపీపీ బక్కమ్మయాదవ్, చారకొండ, వెల్దండ సింగిల్ విండో చైర్మన్లు గురువయ్యగౌడ్, జూపల్లి భాస్కర్‌రావు, రైతుబంధు మండల అధ్యక్షుడు గజ్జెయాదయ్య, ఆర్డీవో రాజేశ్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాంలాల్, తాసిల్దార్ నాగమణి, సర్పంచు లు మల్లీశ్వరి, రంగారెడ్డి, వసంత, మాధవి, సాయికుమార్, రవీందర్‌రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు సలీం, నాయకులు వెంకటయ్యయాదవ్, బాలేమియాతోపాటు అధికా రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.