శ్రీశైలం, సెప్టెంబర్ 29 : శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రో జైన గురువారం మల్లికార్జున స్వామి, భ్రమరాంబికకు పూజలు చేసినట్లు వేదపండితులు తెలిపారు. భ్రమరాంబాదేవి కూష్మాండ దుర్గగా ప్రత్యేక పూజలందుకున్నా రు. సాత్విక రూపంలో సింహవాహనాన్ని అధిష్టించి ఎ నిమిది చేతుల్లో కుడివైపు పద్మం, బాణం, ధనస్సు, క మండలం, ఎడమవైపు చక్రం, గధ, జపమాల, అమృతకళశాన్ని దాల్చి భక్తులకు దర్శనమిచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. సాయంత్రం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి కైలాసవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. మేళతాళాలు, డప్పుచప్పుళ్లు, కేరళ కళాకారుల విన్యాసాలు, పోతరాజు వీరంగాలను చూసేందుకు యాత్రికులు బారులుదీరారు. అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థాన సేవ నిర్వహించినట్లు ఆలయ స్థానాచార్యులు పూర్ణానం ద ఆరాధ్యులు తెలిపారు. ప్రాకారోత్సవంలో కళాకారు ల నృత్యాలు ఆకట్టుకున్నాయని పీఆర్వో శ్రీనివాసరా వు తెలిపారు. తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ఆటపాటలు అలరించాయి. నేడు స్కంధమాతా అలంకారంలో దర్శనమివ్వనున్నది.
అలంపూర్, సెప్టెంబర్ 29 : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం జోగుళాంబ దేవి కూష్మాండదేవిగా దర్శనమిచ్చింది. అలంపూర్‌లోని ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ ఆలయంలో అర్చకులు, ఈవో పురేందర్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ధర్మకర్తల సమక్షంలో వివిధ పూజలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు అమ్మవారు కూష్మాండదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తిలకించిన భక్తులు నయనానందం పొందారు.