నారాయణపేట టౌన్, జూన్ 12 : వేసవి కాలం, వర్షాకాలల్లో కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల చి న్న పిల్లల్లో నీళ్ల విరేచనాలు కలుగుతుంటాయి. అతిగా నీళ్ల విరేచనాలు సంభవించడం వల్ల పిల్లలు మరణిస్తుంటారు. విరేచనాల వల్ల చిన్న పిల్లల్లో కలిగే మరణాలను నియంత్రించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉధృత నీళ్ల విరేచనాల ని యంత్రణ కార్యక్రమం చేపడుతున్నది. 2025 నాటికి పు ట్టిన 1000 మంది పిల్లల్లో మరణాలను 23శాతానికి తగ్గించడమనేది జాతీయ ఆరోగ్య విధానం 2019 ప్రధాన ల క్ష్యంగా నిర్దేశించుకున్నది. అందులో భాగంగా ఈనెల 13 (నేటి) నుంచి 27వ తేదీ వరకు డయేరియా నివారణ పక్షోత్సవాలు నిర్వహించి ప్రజల్లో నీళ్ల విరేచనాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందుకుగానూ ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య సిబ్బందికి శిక్షణ అందించారు.
0-5 ఏండ్ల లోపు పిల్లల్లో అతిసారంతో కలిగే మరణా లు సున్నా చేయాలన్న లక్ష్యంతో జూన్ 13 నుంచి 27 వర కు కార్యక్రమాల నిర్వహణకు ఇంటెన్సిఫైడ్ డయేరియా కం ట్రోల్ ఫోర్ట్‌నైట్ అంగీకరించింది. అందులో భాగంగా చేపట్టనున్న పక్షోత్సవాల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జి ల్లాలో 0-5 ఏండ్ల లోపు పిల్లలు 64,199 మంది ఉన్నట్లు గుర్తించారు. పిలల్లో అతిసార నియంత్రణ కోసం అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేయడంతోపాటు డయేరి యా కేసుల నిర్వహణ కోసం సేవలను మెరుగుపర్చనున్నా రు.
అంతేకాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్, జింక్ కార్నర్లు ఏర్పాటు చేయడం, ఆశ కార్యకర్తలు 5 ఏండ్ల లోపు పిల్లలు ఉన్న ఇండ్లకు వెళ్లి కుటుంబ సభ్యులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నా రు. ముఖ్యంగా హై రిస్క్ ఉన్న ప్రాంతాల్లో ఓఆర్ఎస్ ప్యాకె ట్లు, జింక్ మాత్రలు పంపిణీ చేస్తారు. ఆరోగ్యం, విద్య, వ్య క్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను ప్ర జలకు తెలియజేయనున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు టీకాలు ఇచ్చే కార్యక్రమం నిర్వహించే సమయంలో, అదేవిధంగా పాఠశాలల్లో ప్రార్థనా సమయాల్లో పిల్లలకు చే తులను శుభ్రపర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రదర్శనతో వివరించనున్నారు. పిల్లల తల్లులకు తల్లి పాల ప్రా ముఖ్యత తెలియజేసి, పాలు ఇచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాలు ఇచ్చే విధానాలపై వివరించనున్నా రు. విద్యార్థులకు చేతుల పరిశుభ్రత దశలపై చేతుల కడుక్కొనే ప్రదేశాల్లో పోస్టర్లను అతికించడం, మధ్యాహ్న భోజ న సమయం, మలవిసర్జన అనంతరం చేతులు కడుక్కోవ డం అనే అంశాలపై ఉపన్యాస, వ్యాసరచన, డ్రాయింగ్ పో టీలు నిర్వహించనున్నారు.