ఊట్కూర్, మే 29 : ఈ ఏడాది వానకాలం పంటలకు అనుకూలంగా ముందస్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుండడంతో రైతులు వ్యవసా య పొలాలను దుక్కిదున్ని చదును చేసుకుంటున్నారు. వారం రోజుల కిందట జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీగా కురిసిన వర్షాలు సైతం రైతన్నలకు కలిసి వచ్చాయి. ఆయా గ్రామాల్లో రైతులు తమ అనుకూలతను బట్టి ఎద్దుల నాగలి, ట్రాక్టర్ల సహాయంతో పొలాలను దుక్కిదున్ని సాగు కు సిద్ధం చేస్తున్నారు.
మరికొన్ని రోజుల్లో వచ్చే మృగశిర (మిరుగు) కార్తె వానకాలం సాగుకు అనుకూలం కావడం తో అన్ని గ్రామాల్లో దుక్కిదున్నే పనిలో రైతులు బిజీబిజీ అయ్యారు. ప్రత్యేకించి రైతులు వ్యవసాయం వైపు మొగ్గు చేపేందుకు ప్రభుత్వం రైతాంగానికి చేదేడు వాదోడుగా నిలుస్తున్నది. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సకాలంలో అందుబాటులో ఉంచి సరఫరా చేస్తున్నది. ఏడాదికి రెండు పంటలకు ఎకరాకు రూ.10వేలు పెట్టుబడి సాయం అందించడంతో అన్నదాతలకు పెట్టుబడి భారం తగ్గింది.
దీంతో ప్రస్తుతం సీజన్లో సైతం ఆశించిన పంట లు పండించి వ్యవసాయాన్ని లాభసాటిగా మలుచుకునేందుకు రైతులు కోటి ఆశలతో దేవుడిపై భారం వేసి పొలాల ను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా మండలంలో రెండేండ్ల నుంచి పత్తి, ఆముదం, కందులు, పొద్దు తిరుగు డు, పెసర పంటల సాగు గణనీయంగా పెరిగింది. వ్యవసా య శాస్త్ర వేత్తలు, మండలస్థాయి అధికారుల సూచనలను పాటిస్తూ వానకాలంలో లాభ సాటి పంటలను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
జిల్లాలోని ఊట్కూరు, నర్వ, మక్తల్, దామరగిద్ద, ధన్వాడ, మద్దూర్, మాగనూర్ మండలాల్లో రైతు లు ఇప్పటికే పలుమార్లు వేసవి దుక్కులను పూర్తి చేసుకొని వానకాలం పంట సాగుకు రెడీ అ య్యారు. ఈ క్రమంలో వ్యవసాయాధికారులు సైతం వేసవి దుక్కుల లాభాలను రైతులకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్న ప్రభుత్వం పంట సాగుకు అవసరమైన అన్ని రకాల ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను సంబంధిత సహకార సంఘాలు, ఆగ్రో కేంద్రాల నుంచి పంపిణీ చేస్తున్నది.
మరో పక్క గ్రామాల్లో రైతులకు నకిలీ విత్తనాలపై వివరిస్తూ వారిపట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తూ దాడులు నిర్వహిస్తున్నారు. నకిలీ విత్తనాలు, పురుగుల మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా గ్రామాల్లో రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా అవగాహన సదస్సులు నిర్వహించి నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరిస్తున్నారు.
పంట సాగులో రైతులు నష్టపోకుండా ఇప్పటికే పలుమార్లు రైతు వేదికల్లో సమావేశాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాం. ప్రధానంగా రైతులు వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను అవలంబించి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవాలని, పచ్చిరొట్ట, ప శువుల పేడ, వర్మీ కంపోస్టు ఎరువులను వాడాలి. రైతులు పంట నేల అనుకూలతను బట్టి ఆహార ధాన్యాలను పండించాలి. రై తులకు రాయితీ ధరపై అందించే అన్ని రకాల విత్తనాలను స హకార సంఘాల నుంచి పంపిణీ చేస్తాం.
– గణేశ్రెడ్డి, మండల వ్యవసాయ విస్తరణ అధికారి, ఊట్కూర్